Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు హోస్ట్‌గా మళ్లీ ఆయనే వస్తారా? (Video)

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (11:42 IST)
బిగ్ బాస్ మూడో సీజన్ ఇప్పటికే ముగిసిన నేపథ్యంలో.. నాలుగో సీజన్‌పై అప్పుడే ప్రచారం మొదలైంది. స్టార్ మాలో ప్రసారం అయిన బిగ్ బాస్ మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి కావడంతో నాలుగో సీజన్‌పై నిర్వాహకులు జోరుగా ప్రచారం సాగుతోంది. నాలుగో సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తారని టాక్ వస్తోంది. 
 
తొలి సీజన్‌కు ఎన్టీఆర్ రెండో సీజన్‌కు నాని, మూడో సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. తొలి సీజన్ మంచి హిట్ కావడంతో ఎన్టీఆర్‌నే రంగంలోకి దించాలని.. అప్పుడే నాలుగో సీజన్ అదరగొడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. 
 
ఎన్టీఆర్‌గా హోస్ట్‌గా ఉన్న మొదటి సీజన్‌కు రేటింగ్స్ ఎంతో అద్భుతమైన రీతిలో లభించాయి, దానితో పోలిస్తే నాని హోస్ట్‌గా ఉన్న సీజన్ 2కు మాత్రం అంత ఎక్కువ రేంజ్‌లో రేటింగ్స్ అయితే రాలేదు. ఇక ఇటీవల నాగార్జున హోస్ట్‌గా ఉన్న మూడవ సీజన్‌కు కూడా మళ్ళి రేటింగ్స్ పుంజుకున్నాయి.
 
మొత్తం 17 మంది పార్టిసిపెంట్స్ పాల్గొన్న ఈ సీజన్ లో చివరికి విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. ఇకపోతే వచ్చే ఏడాది ప్రారంభం కాబోయే సీజన్ 4 కోసం మరోసారి ఎన్టీఆర్‌ని హోస్ట్‌గా తీసుకునేలా స్టార్ మా ఛానల్ వారు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. 
 
ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ హిస్టారికల్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న ఎన్టీఆర్, జూన్‌కు కాస్త ఫ్రీ అవుతారు కాబట్టి.. ఆయన్ని ఒప్పించి షోను నడపాలని నిర్వాహకులు కసరత్తులు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ బస్సు.. చివరి సీటులో యువకుడు ఆత్మహత్య.. కారణం ఏంటి?

గర్భిణులకు ఓవర్ డోస్ యాంటీబయోటిక్స్.. నకిలీ డాక్టర్ అరెస్ట్

అదానీతో జగన్ మెడకు ఉచ్చు.. విచారణ ఖాయమేనా..?

పవన్ ప్రచారం ఫలించింది.. రేవంతన్న క్యాంపెయిన్ తప్పిపోయింది..

మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకమే గెలిపించింది.. బాబు, పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments