Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్‌చ‌ర‌ణ్‌తో ప‌ట్టుబ‌ట్టి స్టెప్‌లేసిన కీర్తి సురేష్ కార‌ణం?

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (11:16 IST)
charan-keerti
కీర్తి సురేష్ న‌టించిన  గుడ్ ల‌క్ స‌ఖీ ప్రీ రిలీజ్‌లో మెగాస్టార్ చిరంజీవి రావాల్సివుంది. కానీ ఆయ‌న త‌ర‌ఫున రామ్‌చ‌ర‌ణ్ వ‌చ్చారు. చ‌ర‌న్ ను చూడ‌గానే ఆర్‌.ఆర్‌.ఆర్‌. అల్లూరి సీతారామ‌రాజు గుర్తుకు వ‌చ్చాడంటూ త‌న స్నేహితుల‌తో క‌లిసిన విష‌యాలు చెప్పింది. మాకుటుంబ‌, స్నేహితులు `నాటు నాటు` సాంగ్ కు ఫిదా అయ్యారు. అందుకే మీతో డాన్స్ చేయాల‌నుంద‌ని తెలిపింది. దాంతో రామ్ చ‌ర‌ణ్ మొహ‌మాట‌ప‌డుతూనే నాటునాటు పాట‌కు జ‌త క‌ట్టాడు. చర‌ణ్ అభిమానులంతా జైజై చ‌ర‌ణ్ అంటుంటే కీర్తి గూడా  జైజై చ‌ర‌ణ్ అంటూ ఉత్సాహ‌ప‌రిచారు.
 
అస‌లు ఈ ఈవెంట్‌ను చిరంజీవి వ‌స్తే `ఆచార్య‌`లో సాంగ్‌కు డాన్స్ వేయాల‌నుకుంద‌ట‌. కానీ చిరు రాక‌పోయే స‌రికి చ‌ర‌ణ్‌తో ఇలా స్టెప్‌లేసి కోరిక తీర్చుకుంది కీర్తి. అనంత‌రం ఆమె మాట్లాడుతూ,  మ‌హాన‌టి త‌ర్వాత సైన్ చేసిన సినిమా ఇది. ఫ‌న్ సినిమా చేయాల‌నిపించి గుడ్ ల‌క్ స‌ఖీ చేశా. ద‌ర్శ‌కుడు, నిర్మాత‌ల‌కు ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు. క‌థ బాగా న‌చ్చింది. హైదరాబాద్ బ్లూస్‌.. ఆఫ్ బీట్ ఫిలిం. ఆ త‌ర్వాత గుడ్ ల‌క్ స‌ఖితో న‌గేష్ గారు రావ‌డం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా లుక్ నాచులర్‌గా వుంటుంది. మొద‌టిసారి సింక్ సౌండ్‌తో డైలాగ్ చెప్పాను. అలాగే
కెమెరా చిరంత‌న్ దాస్ బాగా ఫోక‌స్ చేశారు. ఈ సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తిఒక్క‌రినీ ధ‌న్యావాదాలు. జ‌గ‌ప‌తిబాబుగారితో ఎక్కువ సినిమాలు చేశాను. మంచి ఫ్రెండ్ కూడా. ఆది పినిశెట్టి గోల్ రాజుగా గుర్తు పెట్టుకుంటారు.రామ్ చ‌ర‌ణ్‌గారికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలుపుతూ, . రామ్ చ‌ర‌ణ్‌గారి రంగ‌స్థ‌లం, త‌ర్వాత ఆర్‌.ఆర్‌.ఆర్‌. వ‌స్తోంది. అందులో `నాటునాటు సాంగ్‌..` నా కేకాదు మా స్నేహితుల‌కు బాగా న‌చ్చింది. సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అంటూ.. మీతో డాన్స్ చేయాల‌ని నా డ్రీమ్ అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

కానిస్టేబుల్ కర్కశం... కన్నతల్లిని కొట్టి చంపేశాడు..

ప్రధాని మోడీ భద్రతా వలయంలో లేడీ కమాండో...!!

బాలానగర్ సీతాఫలంకు భౌగోళిక గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments