Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ క్రేజే కనకవర్షం కురిపిస్తోంది... జిల్లా కలెక్టరుగా నయన

హీరో ఎవరైనా, దర్శకుడు ఎవరైనా, సినిమా అట్టర్ ప్లాఫ్ అయినా లేక కనకవర్షం కురిపించినా సినిమాను అమాంతంగా పైకి లేపే ఒకే ఒక్క హీరోయిన్ దక్షిణాదిలో ఎవరంటే తార. నయనతార.. ఆమె ఉందంటే నిర్మాత సంతృప్తిగా నిద్రపోవచ్చని అంటున్నారిప్పుడు. ఎందుకంటే అత్యంత నాసిరకం సిన

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2017 (04:42 IST)
హీరో ఎవరైనా, దర్శకుడు ఎవరైనా, సినిమా అట్టర్ ప్లాఫ్ అయినా లేక కనకవర్షం కురిపించినా సినిమాను అమాంతంగా పైకి లేపే ఒకే ఒక్క హీరోయిన్ దక్షిణాదిలో ఎవరంటే తార. నయనతార.. ఆమె ఉందంటే నిర్మాత సంతృప్తిగా నిద్రపోవచ్చని అంటున్నారిప్పుడు. ఎందుకంటే అత్యంత నాసిరకం సినిమాయే అయినా నయన బొమ్మ పడినందుకు నిర్మాతలకు, బయ్యర్లకు కాసుల వర్షం కురిపించిన డోరా చిత్రం నయన పెర్‌పార్మెన్స్ వల్లే అద్భుత విజయం సాధించింది. జనంలో ఆమెకున్న ఆ క్రేజీ పద్నాలుగేళ్ల నట ప్రస్ధానం తర్వాత కూడా ఆమెను దక్షిణాది అగ్రహీరోయిన్‌గా ముందు పీఠిని నిలబెడుతోంది. 
 
ఈ టాప్‌ నాయకి నటిస్తున్న తాజా చిత్రాల్లో అరమ్‌ చిత్రం ఒకటి. షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. నవ దర్శకుడు మింజూర్‌ గోపి మెగాఫోన్‌ పట్టిన ఈ చిత్రంపైనా మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ సందర్భంగా అరమ్‌ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇందులో నయనతార జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నారని తెలిపారు. 
ఈ చిత్రాన్ని నయన్‌ కేవలం 25 రోజుల్లో పూర్తి చేశారని చెప్పారు. 
 
మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి ఆమె సహాయ దర్శకురాలిగా పనిచేశారని చెప్పారు. తనకు సంబంధించిన సన్నివేశాలు పూర్తి అయినా సెట్‌లోనే ఉండి ఇతర నటీనటుల నటనను గమనించేవారని తెలిపారు. అరమ్‌ ఒక ముఖ్యమైన అంతర్జాతీయ సమస్యను ఆవిష్కరించే కథా చిత్రం అని పేర్కొన్నారు. ఇంకా నీటి సమస్యను చర్చించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

కానిస్టేబుల్ కర్కశం... కన్నతల్లిని కొట్టి చంపేశాడు..

ప్రధాని మోడీ భద్రతా వలయంలో లేడీ కమాండో...!!

బాలానగర్ సీతాఫలంకు భౌగోళిక గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments