Webdunia - Bharat's app for daily news and videos

Install App

థమన్ ఆవేదనకు కారణం ఏమిటి? థమన్ మాటలకు చిరంజీవి షాకింగ్ కామెంట్స్

డీవీ
శనివారం, 18 జనవరి 2025 (12:14 IST)
Thaman
బాలక్రిష్ణ నటించిన డాకుమహారాజ్ సక్సెస్ మీట్ సంగీత దర్శకుడు తమన్ చేసిన వ్యాఖ్యలకు ముందుగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. బాలక్రిష్ణ సినిమాలకు మ్యూజిక్ హిట్ అవుతున్నారు. డాకు మహారాజ్ సినిమాకు సంగీతం ఇచ్చినందుకు బాలక్రిష్ణ థమన్ను ఆప్యాయంగా ముద్దుకూడా పెట్టుకున్నారు. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. ఒకసారి ఆడకపోతే వచ్చే విమర్శలు మామూలుగా వుండదు.

తప్పుచేస్తే మేం సరిదిద్దుకుంటాం. కానీ నిర్మాత పెట్టుబడి పెట్టేవాడిమీద అభాండాలు వేస్తున్నారు. అంటూ వ్యాఖ్యానిస్తూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. థమన్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్‌కు సంగీతం ఇచ్చారు. ఆ సినిమా హిట్ టాక్ రాలేదు. కానీ బాలక్రిష్ణ ఢాకుమహారాజ్ సూపర్ హిట్ సంపాదించింది. దాంతో సోషల్ మీడియా, ఇండస్ట్రీలో బయట కూడా నిర్మాతపై నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. దీనికి థమన్ కలత చెందారు. ఇది విన్న మెగాస్టార్ ఈ విధంగా స్పందించారు.
 
నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా  అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. 
 
విషయం సినిమా అయినా క్రికెట్ అయినా  మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, Words can inspire. And Words can destroy. Choose what you wish to do. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు  నడిపిస్తుంది. అని పోస్ట్ చేశారు.

ఇదిలా వుండగా, రామ్ చరణ్ సినిమాలకు సరైన మ్యూజిక్ ఇవ్వలేదనే విమర్శతోపాటు, నందమూరి బాలక్రిష్ణ కూడా ఇకపై ఎస్. థమన్ పేరు నందమూరి కుటుంబంలో ఒకడిగా కలుపుతూ సర్ నేమ్ కూడా మార్చేశాడు. ఇకపై ఎన్.బి.కె. థమన్ అంటూ సక్సెస్ మీట్ స్టేజీ పైన వ్యాఖ్యానించడం కూడా పుండుమీద కారం చల్లినట్లుగా వుందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌: ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోల మృతి

మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య (video)

Pakistani nationals: రాజస్థాన్‌లో 400 మందికి పైగా పాకిస్తానీయులు

Liquor Scam: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం : మరో కీలక వ్యక్తి అరెస్ట్.. ఎవరతను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments