Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓంపురిని హత్య చేశారా.. అనుమానాలు రేకెత్తిస్తున్న డ్రైవర్ కథనం

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (03:38 IST)
బాలీవుడ్ నిరుపమాన నటుడు ఓంపురి హత్యకు గురయ్యాడా? హిందీ చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడుగా సమాంతర చిత్రాల దిగ్గజ నటుడిగా పేరొందిన ఓంపురు తీవ్రమైన గుండెపోటుతో చనిపోయినట్లు మొదట్లో వార్తలువచ్చినా మరణించిన తీరుపై కొత్త కథనాలు ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి..
 
ఓంపురి మరణంపై అనుమానాలు తలెత్తుతున్న సందర్భంగా పోలీసులు విచారణను తీవ్రతరం చేశారు. గుండెపోటుతోనే తాను చనిపోయినట్లు మొదట్లో భావించిన పోలీసులు మొదట్లో యాక్సిడెంటల్ డెత్ నివేదికను నమోదు చేశారు. కానీ ఓంపురి కారు డ్రైవర్ చెబుతున్న తాజా కథనాన్ని చూస్తే ఆయన మరణంపై అనుమానాలు ప్రబలుతున్నాయి. 
 
వాస్తవానకి ఓంపురి ఇంట్లో ఒంటరిగా ఉండగా తాను చనిపోవడం సంభవించింది. ఆయన మరణ కారణాలను ఇంకా వైద్యులు బయటపెట్టలేదు. పోస్టు మార్టెమ్ నివేదిక రావడానికి మరో రెండు వారాలు పడుతుంది.
 
ఈలోగా అనుమానాల నివృత్తికోసం ఓంపురి డ్రైవర్‌ని విచారించిన పోలీసులకు దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిశాయి. ఓంపురి తన ఇంట్లోని వంటగదిలో నగ్నదేహంతో కనిపించాడని, తన తలకు గాయం ఉండటం గమనించానని, డ్రైవర్ తెలిపాడు. పైగా గుండెపోటుతోనే ఓంపురి చనిపోయారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పని డ్రైవర్ ఖచ్చితంగా ఆ విషయం నాకు తెలియదని, పోలీసుల విచారణలోనే నిజం బయటకు రావచ్చని పేర్కొన్నాడు. 
ఓంపురి వంటి సహజ నటుడి మరణంలో అసహజ విషయాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఆయన భార్యతో సహా సమీప బంధువులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments