Naveen Polishetty : అనగనగా ఒక రాజు గా నవీన్‌ పొలిశెట్టి ఊరికోసం ఏం చేశాడు?

దేవీ
సోమవారం, 26 మే 2025 (16:35 IST)
as a Anaganaga oka raju Naveen Polishetty
తనదైన ప్రత్యేక కామెడీ టైమింగ్ తో వున్న నవీన్‌ పొలిశెట్టి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అనగనగా ఒక రాజు'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన మోషన్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంతో నవీన్‌ పొలిశెట్టి థియేటర్లలో నవ్వుల పండుగను తీసుకురాబోతున్నాడని మోషన్ పోస్టర్ తోనే అర్థమైంది.
 
తెలుగు సినీ అభిమానులు సంక్రాంతి పండుగను సినిమా పండుగలా భావిస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ లకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే పండుగకి సరైన సినిమాగా 'అనగనగా ఒక రాజు' వచ్చే సంక్రాంతికి థియేటర్లలో అడుగుపెట్టనుంది.
 
తెలుగు సినీ పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి 'అనగనగా ఒక రాజు'లో నవీన్‌ పొలిశెట్టికి జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేక్షకులను సరికొత్త వినోదాన్ని అందించేలా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు.
 
మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. పండుగ రుచికి సరిగ్గా సరిపోయేలా ఆయన తనదైన మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థలు కొన్నేళ్లుగా వరుస ఘన విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'డాకు మహారాజ్' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2026 సంక్రాంతికి 'అనగనగ ఒక రాజు'తో మరో పండగ విజయాన్ని ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఉప్పాడ వచ్చి మీతో తిట్లు తింటా, అలాంటి పనులు చేయను: పవన్ కల్యాణ్

దుబాయ్‌లో దీపావళి అద్భుతాన్ని అనుభవించండి

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments