Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా క‌ష్టాలు పడ్డాం. ఫైనల్ గా విడుద‌ల‌చేస్తున్నాం - హీరో నరేన్

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (18:48 IST)
Naren, Deepali Sharma
నరేన్, దీపాలి శర్మ జంటగా నటించిన సినిమా `ఊరికి ఉత్తరాన`. ఈ చిత్రాన్నిఈగల్ ఐ ఎంటైర్ టైన్మెంట్స్  బ్యానర్ పై వనపర్తి వెంకటయ్య, రాచాల యుగంధర్ నిర్మించారు. సతీష్ అండ్ టీమ్ దర్శకత్వం వహించిన `ఊరికి ఉత్త‌రాన‌` సినిమా ఈ నెల 19న థియేటర్లలో విడుదలవుతోంది. 
 
ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ మాట్లాడుతూ...`ఊరికి ఉత్త‌రాన‌` సినిమా టెక్నికల్ గా బాగుందంటే మా సాంకేతిక నిపుణులకు క్రెడిట్ దక్కుంది. అలాగే రైటర్స్ ఆకట్టుకునేలా రాశారు. సినిమా బాగా వచ్చింది. హీరో నరేన్ నేను కథ చెప్పినప్పటి నుంచి నన్ను నమ్మి నేను అనుకున్నట్లు సినిమా చేసేలా ప్రోత్సహించారు. బడ్జెట్ పెరిగినా అనుకున్నది అనుకున్నట్లు చేశాం. రేపు థియేటర్లలో మీకు తప్పకుండా `ఊరికి ఉత్త‌రాన‌` సినిమా నచ్చుతుంది. అన్నారు.
 
హీరో నరేన్ మాట్లాడుతూ...టాలీవుడ్ లో చిన్న సినిమాలకు ఎన్ని కష్టాలుంటాయో మీకు తెలుసు. మేమూ ఆ ఇబ్బందులన్నీ పడ్డాం. ఫైనల్ గా సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. `ఊరికి ఉత్త‌రాన‌` సినిమా సక్సెస్ మీట్ కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాం. సినిమా మీద అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మేము ఎందుకు ఇంత ఆత్మవిశ్వాసంతో ఉన్నాం అనేది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ ఇది. సినిమా కోసం వేసిన వరంగల్ సెట్ ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. అన్నారు.
 
హీరోయిన్ దీపాలి శర్మ మాట్లాడుతూ...`ఊరికి ఉత్త‌రాన‌` మీరు రెగ్యులర్ గా చూసే లవ్ స్టోరి కాదు. చాలా  కొత్త కథ, ప్లెజంట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఈ చిత్రంలో శైలు అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ పాత్రను బ్యూటిఫుల్ గా మలిచారు మా దర్శకుడు సతీష్. నా క్యారెక్టర్ మాత్రమే కాదు సినిమాలో ప్రతి పాత్ర అద్భుతంగా ఉంటుంది. హీరో నరేన్ నాకు కంప్లీట్ గా సపోర్ట్ చేసి బాగా నటించేలా చేశారు. `ఊరికి ఉత్త‌రాన‌` థియేటర్లలో తప్పకుండా చూడండి. అన్నారు.
 
ఈ కార్యక్రమంలో  నిర్మాత మోహన్ వడ్లపట్ల పాల్గొని చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దమ్ముంటే నన్నుఅరెస్ట్ చేయాలి.. వైకాపా చీఫ్ జగన్ సవాల్

దుబాయ్ వీధుల్లో టర్కిష్ ఐస్ క్రీమ్‌ను రుచి చూసిన అనంత్ రాధిక (Video)

కేటీఆర్- సమంత కేసు.. సాక్షుల వాంగ్మూలం రికార్డ్.. తర్వాత ఎవరు?

పోలీసు నోటీసులు అందుకున్న రాంగోపాల్ వర్మ.. త్వరలోనే అరెస్టా?

బెంగళూరులో 42 కేసులు నమోదు.. 64మంది అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments