Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో కలిసే వుంటాం ఇంకా తెర‌పైనా - అమ‌ల అక్కినేని

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (17:38 IST)
Amala Akkineni
ఇంట్లో ఎప్పుడూ కలిసే వుంటాం. మళ్ళీ స్క్రీన్ పై వద్దండీ.( నవ్వుతూ). ఇటివల నాగార్జున‌ నటించిన బ్రహ్మాస్త్ర  చూశాను. నాకు చాలా నచ్చింది. నాగార్జున గారి ప్రజన్స్ కొంత సమయమే అయినా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ముంబాయి నుండి కూడా చాలా మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది- అంటూ అమల అక్కినేని అన్నారు. 
 
హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో అమల అక్కినేని చిత్ర‌ సక్సెస్ విశేషాలు పంచుకున్నారు.
 
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తర్వాత విరామం రావాడానికి కారణం ?
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తర్వాత రెండు మలయాళం, మూడు హిందీ సినిమాలు, ఒక వెబ్ సిరిస్ చేశాను. ప్రతి భాషలో ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. కానీ తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తర్వాత ఇదే. అయితే గత ఐదేళ్ళుగా అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియా నేనే చూసుకుంటున్నాను. వందలమంది విద్యార్ధుల భవిష్యత్ భాద్యత నాపై వుంది. ఈ భాద్యతని పక్కని పెట్టి నటనలో బిజీగా వుండటం కష్టం. అయితే నా మనసుకు హత్తుకునే కథ విన్నపుడు, ఆ పాత్రకి నేను కరెక్ట్ అనిపిస్తే మాత్రం తప్పకుండా చేస్తాను. ఒకే ఒక జీవితం అలా మనసుకు నచ్చిన కథే. ఒక నిజాయితీతో తీసిన సినిమా ప్రేక్షకులకు ఎప్పుడూ నచ్చుతుంది. ఒకే ఒక జీవితం మరోసారి దాన్ని రుజువుచేసింది.
 
టైం మిషన్ లో వెళ్ళే అవకాశం వస్తే ఏ టైంలోకి వెళ్తారు ?
పదేళ్ళు భవిష్యత్ లోకి వెళ్తాను (నవ్వుతూ). ఇప్పుడు చాలా పనులు చేస్తున్నాం. ఆ పనులు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చాయో చూడాలని వుంది. అవి విజయాన్ని సాధించాయో లేదో తెలుసుకోవాలని వుంది(నవ్వుతూ)
 
విధి, కాలంని నిజ జీవితంలో ఎలా నిర్వచిస్తారు, విధితో సంబంధం లేకుండా మనిషి తన జీవితాన్ని గెలుచుకోగలడా ?
జీవితంలో ప్రతి అవకాశం కోసం ప్రయత్నిస్తాం. ఒక ప్రయత్నంలో విజయం, మరో ప్రయత్నంలో అపజయం వుంటుంది. అపజయం, జయం కోసం మనల్ని సిద్ధం చేస్తోంది. జీవితంలో జయానికి అపజయానికి సమానమైన ప్రాధాన్య ఉంటుందని భావిస్తాను. అపజయం చాలా విషయాల్ని నేర్పిస్తుంది. లైఫ్ టైం ని ఒక రిహార్సల్ గా భావిస్తే సరైన సమయం వస్తుందని నా ఆలోచన. ఇలాంటి ఒక సక్సెస్ రావడానికి నేను చాలా ప్రయత్నాలు చేసివుంటాను. కొన్ని ప్రయత్నాలు విజయాన్ని ఇవ్వలేకపోవచ్చు. కానీ ఆ అనుభవాలన్నీ విజయానికి బాటలు వేస్తాయని భావిస్తాను.
 
తెరపై మీ పాత్ర చుసుకున్నపుడు మీ అమ్మగారి వున్న జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయా ?
ఈ సినిమా చూసి మా అమ్మగారు నన్ను చాలా గట్టిగా కౌగలించుకుకొని 'ఐ యామ్ సో ప్రౌడ్  అఫ్ యూ' అన్నారు. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. నాగార్జునతో పాటు అఖిల్, మా కుటుంబ సభ్యులందరూ ఈ చిత్రానికి చాలా డీప్ గా కనెక్ట్ అయ్యారు. నన్ను చూడకుండా కేవలం కథ, పాత్రలతో ప్రయాణం చేశారు.గొప్ప తృప్తిని, హాయిని ఇచ్చిన సినిమా 'ఒకే ఒక జీవితం.
 
బ్లూ క్రాస్ పనులు చూసుకోవడానికి సమయం కుదురుతుందా ?
బ్లూ క్రాస్ అఫ్ హైదరాబాద్ కి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం ఆనందంగా వుంది. మంచి వైద్యులు, మ్యానేజ్మెంట్, సిబ్బంది వుంది. బ్లూ క్రాస్  గొప్ప స్థాయికి వచ్చింది. నేను వున్నా లేకపోయినాకూడా అద్భుతమైన సేవలు అందిస్తుంది. అయితే నా తరపునుండి ప్రతి శనివారం స్వచ్చందంగా వెళ్లి పని చేస్తాను.
 
ఇంట్లో సినిమాలు గురించి మాట్లాడుతుంటారా ?
నాగార్జున, చైతు, అఖిల్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ప్లానింగ్స్ గురించి మాట్లాడుతుంటారు. నేను వింటాను. అయితే ఫిల్మ్ స్కూల్ లో ఎక్కువగా సినిమాలు గురించి చర్చిస్తుంటాం. విద్యార్ధులతో కలసి సినిమా గురించి లోతైన విశ్లేషణలు ఫిల్మ్ స్కూల్ లోనే ఎక్కువగా జరుపుతుంటాం అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments