Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ హోస్టెస్ గెటప్‌లో సోనమ్ కపూర్.. నీర్జా భానోట్ పాత్రలో అదుర్స్ (ట్రైలర్ చూడండి)

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2015 (16:54 IST)
గ్లామర్ తారగా ఓ వెలుగు వెలుగుతున్న గ్లామర్ క్వీన్ సోనమ్ కపూర్.. ఇండియన్ ఏవియేషన్‌లో తరచుగా వినిపించే పేరు నీర్జా భానోట్ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 29 ఏళ్ల క్రితం జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా రూపుదిద్దుకోనున్న నీర్జా అనే సినిమాలో సోనమ్ కపూర్ లీడ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.

1986లో కరాచీ నుంచి బయల్దేరిన ఓ ఫ్లైట్‌ని ఆయుధాలతో కూడిన అబు నిదాల్ సంస్థకు (పాకిస్థాన్) చెందిన ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు.  ఆ ఫ్లయిట్‌లోని 359మంది కాపాడి తన ప్రాణాన్ని పోగొట్టుకున్న 22 ఏళ్ళ త్యాగమూర్తి నీర్జా భానోట్ అన్న సంగతి తెలిసిందే. 
 
అలాంటి త్యాగమూర్తి పాత్రలో నీర్జాగా మీ ముందుకు వస్తున్నానని సోనమ్ కపూర్ వెల్లడించింది. ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారిపోద్దని ఆమె చెప్తుంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్‌ను చూస్తే యదార్థంగా జరిగిన ఈ ఘటన కళ్లకు కట్టినట్లుగా చూపించడంలో డైరెక్టర్ రామ్ మద్వాని సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి
 
ఎయిర్ హోస్టెస్ గెటప్‌ సోనమ్ కపూర్‌కి బాగా కుదిరిందని సినీ వర్గ ప్రముఖులు తెలిపారు. ఇంతేకాకుండా సోనమ్ కపూర్ లవ్ సీన్స్‌లను మాత్రమే కాకుండా సెంటిమెంట్స్ సీన్స్‌లను కూడా బాగా పండించింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి హైలైట్‌గా నిలిచింది. మరి ఈ రోల్ సోనమ్‌కు కలిసొస్తుందో లేదో వేచి చూడాలి.

 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments