Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ లైగర్ నుండి వాట్ లాగా దేంగే విడుదల

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (15:48 IST)
Liger,
పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్  ''లైగర్''(సాలా క్రాస్‌బ్రీడ్) ఆగస్ట్ 25న విడుదల కానుంది. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు.
 
ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ చిత్రంపై భారీ హైప్, అంచనాలను పెంచింది. దేశం మొత్తం ఎదురుచూస్తున్న చిత్రంగా నిలిచింది. ఫస్ట్ సింగిల్ ' అక్డీ పక్డీ ' వైరల్‌గా మారి మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం ఫస్ట్ సింగిల్, ట్రైలర్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్నాయి.
 
ట్రైలర్ సూపర్ సక్సెస్ తర్వాత చిత్ర యూనిట్ 'వాట్ లాగా దేంగే'  అనే థీమ్ సాంగ్ ను విడుదల చేసింది. ఈ థీంమ్ సాంగ్  లైగర్ స్వాగ్, యాటిట్యుడ్ ని ఆవిష్కరించింది. స్లమ్‌డాగ్ నుండి ఎంఎంఏ ఫైటర్ గా దేశానికి ప్రాతినిధ్యం వహించే జర్నీ గ్లింప్స్ విజువల్స్ బ్రిలియంట్ గా వున్నాయి.
 
"వీ ఆర్ ఇండియన్స్.. హమ్ కిసీసే కమ్ నహీ" .. "వాట్ లగా దేంగే... ఆగ్ హే అందర్" అని ఈ థీమ్ సాంగ్ లో లైగర్ చెప్పిన మాటలు పవర్ ఫుల్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి. మ్యూజికల్ గా విజువల్ గా 'వాట్ లాగా దేంగే' షేక్ చేస్తోంది.
 
పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
 
తారాగణం: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా
బ్యానర్లు: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
డీవోపీ: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
స్టంట్ డైరెక్టర్: కేచ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ... రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత (Video)

సునీత విలియమ్స్ - బచ్ విల్మెర్ పరిస్థితేంటి : వీరు లేకుండానే కదిలిన ఆస్ట్రోనాట్ క్యాప్సుల్

రూ.33 కోట్లు దారి మళ్లించిన స్విగ్గీ మాజీ ఉద్యోగి!

అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా సైలెంట్‌గా సైనెడ్‌తో చంపేసే లేడీ కిల్లర్స్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments