Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లూరి సీతారామరాజు బ‌యోపిక్ "సీతారామరాజు" - ఏ ట్రూ వారియర్

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (10:55 IST)
రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో బ్యానర్ పైన డా. శ్రీనివాస్ నిర్మాతగా సొంత ఊరు, గంగపుత్రులు, గల్ఫ్ వంటి సామాజిక చిత్రాలను రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథ వంటి యూత్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా "సీతారామరాజు" - ఏ ట్రూ వారియర్ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
మన్యంలో జరుగుతున్న తెల్లదొరల ఆకృత్యాలకు నిరసనగా విప్లవ బావుటా ఎగరవేసిన పాతికేళ్ల కుర్రాడి పోరాట గాథను ఉత్తమ సాంకేతిక విలువలతో తెరకెక్కించనున్నారు. మార్చిలో షూటింగ్ ప్రారంభమౌతున్న ఈ చిత్రాన్నిఆగస్టులో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.  ఈ చిత్రానికి సహ నిర్మాతలు యెక్కలి రవీంద్రబాబు, డా.ఎల్.ఎన్.రావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత బాపిరాజు.
 
ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... 'అప్పటి చరిత్రతో ఇప్పటి యువతకి స్ఫూర్తి నింపేలా అల్లూరి సీతారామరాజు త్యాగం ఆయన కీర్తిని మరింత ఇనుమడింపజేసే దిశగా "సీతారామరాజు" - ఏ ట్రూ వారియర్ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా పూర్తి పోస్ట్ ప్రొడక్షన్ వసతులతో స్టూడియో ఏర్పాటు చేసిన రిసాలి ఫిల్మ్ స్టూడియో అండ్ అకాడమీ బ్యానర్ పైన ఈ చిత్ర నిర్మాణం జరుగుతుంది. విశాఖ, కాకినాడ, రాజమండ్రి, ఏజెన్సీల పరిసర ప్రాంతాల్లో సింహ భాగం షూటింగ్ జరుపుకునే ఈ చిత్రానికి సీనియర్ సాంకేతిక నిపుణుల బృందం పనిచేస్తుంది. 
 
నూతన నటీనటులతో పాటు సీనియర్ నటీనటులు కూడా ఇందులో నటిస్తారు.  మార్చిలో షూటింగ్ ప్రారంభమౌతున్న ఈ చిత్రాన్నిఆగస్టులో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు చేసిన సాయుధ పోరాట నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఉన్న గ్రాఫిక్స్ వర్క్ కు సంబంధించిన సీజీ వర్క్ ఇప్పటికే జరుగుతోంది. 
 
చరిత్రకారుల సహకారంతో సీతారామరాజు మరణానికి సంబంధించిన మిస్టరీని కూడా ఈ చిత్రంలో చూపించనున్నాం. త్వరలో సాంకేతిక నిపుణులు, నటీనటుల పూర్తి వివరాలు తెలియజేస్తాం' అని అన్నారు. బ్యానర్ - రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో, నిర్మాత - డా.శ్రీనివాస్, సహ నిర్మాతలు - యెక్కలి రవీంద్రబాబు, డా.ఎల్.ఎన్.రావు, ఎగ్జిక్యూటివ్ - నిర్మాత బాపిరాజు, రచన, దర్శకత్వం - పి. సునీల్ కుమార్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్‌కు దివ్వెల మాధురి వార్నింగ్.. డ్యాన్స్‌కు శ్రీనివాస్ ఫిదా (video)

బియ్యం గోడౌన్‌లో గంజాయి బ్యాగ్ పెట్టేందుకు ప్రయత్నించారు, పోలీసులపై పేర్ని నాని ఆరోపణ

భార్యపై కేసు పెట్టారు... తల్లిపై ఒట్టేసి చెప్తున్నా.. పేర్ని నాని

అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?

APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments