Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ తో బిగ్గర్ రోల్ వుండే సినిమా చేయాలని ఉంది : ఫరియా అబ్దుల్లా

డీవీ
గురువారం, 5 సెప్టెంబరు 2024 (18:58 IST)
Faria Abdullah
మత్తు వదలరాకు సీక్వెల్ గా 'మత్తువదలారా2'  ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతోంది. శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్ లో తన సైడ్ కిక్ గా సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా  హీరోయిన్ గా నటిస్తోంది. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సినిమా విశేషాలని పంచుకున్నారు.
 
'మత్తువదలారా2' ప్రాజెక్ట్ లో ఎలా వచ్చారు? కథ విన్నప్పుడు ఏం అనిపించింది ?  
 -'మత్తువదలారా2' ఒక థ్రిల్లర్. యాక్టర్స్ ట్రాజీడీ నుంచి కామెడీ జనరేట్ అవుతుంది. కథ చాలా నచ్చింది. విన్న వెంటనే ఇమ్మిడియట్ గా ఓకే చేసేశా. మత్తువదలారా పార్ట్ 1 బిగ్ హిట్. సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ కి డిఫరెంట్ గా వుంటుంది. శ్రీసింహ, సత్య క్యారెక్టర్స్ డెలివరీ బాయ్స్ నుంచి స్పెషల్ గా ఏజెంట్ గా కనిపిస్తారు,
 
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది ?
-ఇందులో నా క్యారెక్టర్ పేరు సన్నిధి. తను కూడా ఒక స్పెషల్ ఏజెంట్. శ్రీసింహ, సత్య క్యారెక్టర్స్ పై సాఫ్ట్ కార్నర్ వుంటుంది. ఇందులో నా క్యారెక్టర్ యాక్షన్ వుంటుంది. మాచో రోల్. అది నాకు చాలా నచ్చింది. గన్స్ తో యాక్షన్ ప్లే చేయడం చాలా ఎంజాయ్ చేశా.
 
-ఈ సినిమాలో లిరిక్స్ రాయడంతో పాటు సాంగ్ పాడాను. డైరెక్టర్ రితేష్ కి ఈ ఆలోచన చెప్పినపుడు ఆయనకి చాలా నచ్చింది. అలాగే నా టీంతో సాంగ్ కొరియోగ్రఫీకూడా చేశాను.
 
శ్రీసింహ, సత్యలది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కదా.. ఆ కాంబోని మీరు ఎలా మ్యాచ్ చేశారు?
-నేను అందరితో కలసిపోతాను. వాళ్ళ హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్ కి నా క్యారెక్టర్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో నా క్యారెక్టర్ కాస్త స్మార్ట్ గా వుంటుంది.
 
డైరెక్టర్ రితేష్ రానా గురించి ?
-రితేష్ రానా చాలా క్లారిటీ వున్న డైరెక్టర్. చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన అంత ఫ్రీడమ్ ఇవ్వబట్టే సాంగ్ కొలాబరేషన్ సాధ్యపడింది. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని వుంది.
 
కల్కిలో రోల్ చేయడం ఎలా అనిపించింది?
-చాలా ఎక్సయిటింగ్ ఎక్స్ పీరియన్స్ అది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి థాంక్ యూ. ప్రభాస్ గారితో బిగ్గర్ రోల్ వుండే సినిమా చేయాలని కోరుకుంటున్నాను.
 
శ్రీసింహ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-శ్రీసింహ వెరీ ట్యాలెంటెడ్, స్వీట్. చాలా హార్డ్ వర్కింగ్ చేస్తారు. ఆయనతో మళ్ళీ కలసి పని చేయాలని వుంది.  
 
సునీల్, వెన్నెల కిషోర్ పాత్రల గురించి ?
-వెన్నెల కిషోర్ గారితో జాతిరత్నాల నుంచి పరిచయం వుంది. సునీల్ గారు జెమ్. వారి పాత్రలు ప్రేక్షకులని చాలా ఎంటర్ టైన్ చేస్తాయి.
 
కాల భైరవ గారితో కలసి పని చేయడం ఎలా అనిపించింది?  
- కాల భైరవ గారి మ్యూజిక్ సర్ ప్రైజింగ్ గా వుంటుంది. నా సాంగ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు.
 
 క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతల గురించి?
-చాలా సపోర్ట్ చేశారు. చాలా కంఫర్ట్ బుల్ గా చూసుకున్నారు. వారితో పని చేయడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్. నాకు చిన్నప్పటి నుంచి రైటింగ్ పై ఆసక్తి వుంది. ఈ సినిమాలో పాట రాసిన అవకాశం కూడా ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
 
'మత్తువదలారాకి పార్ట్ 2కి ఎలాంటి పోలికలు వుంటాయి?
-మత్తువదలారా ఫ్యాన్ బేస్ ఇందులో వుండే కంటెంట్ ని చాలా ఎంజాయ్ చేశారు. అలాగే స్టాండ్ లోన్ సినిమాగా కూడా ఈ మూవీ చాలా ఎంటర్టైన్ చేస్తుంది.
 
మీరు రియల్ లైఫ్ లో ఫన్నీ గా ఉంటారా ?
-నేను జనరల్లీ హ్యాపీ పర్శన్. నా చుట్టూ వుండే వాళ్ళు కూడా హ్యాపీగా వుండాలని చూస్తుంటాను. సరదాగా జోక్స్ చేస్తూవుంటాను.
 
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి
-తిరువీర్ తో ఓ లవ్ స్టొరీ చేస్తున్నాను. ఒక తమిళ్ మూవీ స్టార్ట్ కాబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments