Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌య్య‌కి క‌థ రెడీ చేస్తోన్న స్టార్ రైట‌ర్..!

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. క్రిష్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస

Webdunia
బుధవారం, 25 జులై 2018 (20:18 IST)
నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. క్రిష్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే...బాల‌య్య డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్‌తో సినిమా చేయ‌నున్నాడ‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి కానీ.. క‌థ మాత్రం సెట్ కావ‌డం లేదు. 
 
ఇప్ప‌టివ‌ర‌కు వినాయ‌క్ చాలామంది రైట‌ర్స్‌తో క‌థ రెడీ చేయించినా... ఆ క‌థ‌లు బాల‌య్య‌కు న‌చ్చ‌లేదు. సీనియర్ రైట‌ర్స్ ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ రెడీ చేసిన స్ర్కిప్ట్ కూడా బాల‌య్య‌కు న‌చ్చలేద‌ట‌. ఈసారి స్టార్ రైట‌ర్ గోపీ మోహ‌న్‌ని రంగంలోకి దించుతున్నాడ‌ట వినాయ‌క్. గోపీ మోహ‌న్ క‌థ రెడీ చేసాడ‌ని... టైమ్ ఇవ్వాల‌ని బాల‌య్య‌ని అడిగితే... త్వ‌ర‌లోనే చెబుతా అన్నాడ‌ట‌. ఎన్టీఆర్ బ‌యోపిక్ త‌ర్వాత బాల‌య్య బోయ‌పాటితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మ‌రి... గోపీ మోహ‌న్ అయినా బాల‌య్య‌ను మెప్పిస్తాడో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీకి ఇంధనం దిల్ రాజు, నా బంగారం రామ్ చరణ్: డిప్యూటీ సీఎం పవన్

మకర సంక్రాంతికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి వుండరా?

Telangana : తెలంగాణలో ఎటువంటి కేసులు లేవు - HMPVపై భయం వద్దు

Thota Trimurthulu: పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలి.. తోట త్రిమూర్తులు

ఉత్తర భారతదేశాన్ని కప్పేస్తున్న పొగమంచు, కుక్కపిల్లలకు చలిమంట వేస్తున్న యువకుడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments