Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ మూవీలో విలన్‌గా 'రక్తచరిత్ర' పరిటాల రవి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. "రంగస్థలం" వంటి మెగా హిట్ మూవీ తర్వాత చెర్రీ చేస్తున్న మూవీ. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో, 'రక్తచరిత్ర' చిత్రంల

Webdunia
బుధవారం, 18 జులై 2018 (15:47 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. "రంగస్థలం" వంటి మెగా హిట్ మూవీ తర్వాత చెర్రీ చేస్తున్న మూవీ. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో, 'రక్తచరిత్ర' చిత్రంలో పరిటాల రవి పాత్రలో నటించిన వివేక్ ఓబెరాయ్ విలన్‌గా నటిస్తున్నారు.
 
నిజానికి రక్తచరిత్ర చిత్రంలో వివేక్ ఓబెరాయ్ అద్భుతమైన నటను ప్రదర్శించిన విషయం తెల్సిందే. ప‌రిటాల ర‌వి పాత్రలో ఆయన జీవించాడు. అభిమానుల గుండెల్ని ట‌చ్ చేశాడు. మొర‌టు ఆకారం, మాట తీరుతో అత‌డు తెర‌పై రియ‌ల్ ఫ్యాక్ష‌నిస్టుని త‌ల‌పించారు. 
 
దీంతో ఆయనకు టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అలాగే, బాలీవుడ్ చిత్రం "క్రిష్‌-3"లో కూడా విలన్‌గా నటించి చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. 
 
అలాంటి వివేక్ ఓబెరాయి... మిస్టర్ సి - బోయపాటి చిత్రంలో ఒబేరాయ్‌ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఈ వార్త బయటకు పొక్కగానే ప్రతి ఒక్కరిలోనూ ఒక‌టే క్యూరియాసిటి ఏర్పడింది. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విల‌నిజం ఏ స్థాయిలో ఉంటుందోనని అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments