తమిళ హీరో అజిత్ నటించిన 'వివేకం' (తమిళంలో వివేగం) చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ చిత్రం కలెక్షన్లు కూడా తెరమరుగయ్యాయి. ఈ చిత్రం గురువారం రాష్ట్ర వ్యాప్తంగా
తమిళ హీరో అజిత్ నటించిన 'వివేకం' (తమిళంలో వివేగం) చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ చిత్రం కలెక్షన్లు కూడా తెరమరుగయ్యాయి. ఈ చిత్రం గురువారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలకాగా, ఒక్క చెన్నై మహానగరంలోనే మొదటి రోజు రూ.1.21 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
'కబాలి' చిత్రం సృష్టించిన రూ.1.12 కోట్ల మొదటి రోజు కలెక్షన్ల మార్కును ఈ చిత్రం దాటేసింది. ఇందులో కాజల్, వివేక్ ఓబెరాయ్, అక్షర హాసన్‌లు కీలక పాత్రలు పోషించారు. దీనికి శివ దర్శకత్వం వహించగా అనిరుధ్ స్వరాలు అందించారు. మొదటి రోజే మంచి టాక్‌తో చెన్నై సిటీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇదిలావుంటే గతంలో విజయ్ నటించిన ‘తెరి’ చిత్రం రూ.1.05 కోట్లు రాబట్టింది. అలాగే అమెరికాలో కూడా ‘వివేకం’ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. అక్కడ మొదటి రోజు రూ. 1.37 కోట్లు రాబట్టినట్లు సమాచారం.
మరోవైపు... ఈ చిత్రం అజిత్ అభిమానులకు ఒక రేంజ్‌లో నచ్చేసిందట. ఈ సినిమా హిట్ కావాలని కాజల్ ఎంతగానో కోరుకుంది. అలాగే ఆమెకి అక్కడ ఈ సినిమా హిట్ తెచ్చి పెట్టేసిందని అంటున్నారు. తెలుగులోనూ ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా ఇక్కడ హిట్ అయితే కాజల్ ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టు అవుతుంది.