Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బాయిగా, అమ్మాయిగా నటిస్తున్న విశ్వక్సేన్.. లైలా

డీవీ
సోమవారం, 30 డిశెంబరు 2024 (11:21 IST)
Vishvaxen - Laila
విశ్వక్సేన్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లైలా' వాలంటైన్ డే కానుకగా ఫిబ్రవరి 14, 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ అబ్బాయిగా, అమ్మాయిగా రెండు క్యారెక్టర్స్ పోషించి తన వెర్సటాలిటీ చూపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే స్ట్రయికింగ్ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌తో దృష్టిని ఆకర్షించింది.
 
మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్‌స్టార్ట్ చేస్తూ, మేకర్స్  ఫస్ట్ సింగిల్ సోను మోడల్‌ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాట విశ్వక్సేన్ పాత్ర, సోను మోడల్‌ను పరిచయం చేస్తుంది. అతని పర్సోనా పై ఒక గ్లింప్స్ అందిస్తుంది. ఇది సోను చార్మ్, తన ప్రత్యేక స్కిల్స్ తో అమ్మాయిల మనసులని ఎలా గెలుచుకుంటాడో హైలైట్ చేస్తుంది. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ట్యూన్ ఆకట్టుకునే బీట్‌లతో మెస్మరైజ్ చేస్తుంది.
 
ఈ వైబ్ ఏంథమ్ కి విశ్వక్సేన్ స్వయంగా లిరిక్స్ రాస్తూ ఫన్ నంబర్‌కు పర్శనల్ టచ్ జోడించారు. ఈ పాటను సింగర్స్ నారాయణ్ రవిశంకర్, రేష్మా శ్యామ్ ఎనర్జిటిక్ గా పాడారు. విశ్వక్సేన్, ఎనర్జీతో నిండి, తన డైనమిక్  డ్యాన్స్ మూమెంట్స్ ని ప్రజెంట్ చేశారు.   లావిష్ గా చిత్రీకరించిన ఈ పాట విజువల్ ఫీస్ట్‌ను అందిస్తుంది. ఈ సాంగ్ చార్ట్‌బస్టర్ బిగినింగ్ తో మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ కి స్టేజ్ ని సెట్ చేసింది.
 
ఈ మూవీతో ఆకాంక్ష శర్మ కథానాయికగా అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హమాస్ కమాండ్ కంట్రోల్‌ ఆస్పత్రిలో దాడి.. 43 మంది మృతి

ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మృతి.. పవన్ కల్యాణ్ ఆదేశాలు

పీకలేకపోయిన పవన్ పార్టీలో చేరతానా? తమ్మినేని సీతారాం (Video)

ఏపీ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్

పెళ్లి విందు వడ్డించడంలో ఆలస్యం... వివాహాన్ని రద్దు చేసుకున్న వరుడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments