Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ డేట్ ఫిక్స్

Webdunia
గురువారం, 9 మార్చి 2023 (17:43 IST)
Vishwak Sen
హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సినిమాలో విశ్వక్ పాత్రలోని రెండు షేడ్స్‌ని చూపించే అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆసక్తికరంగా వుంది. పోస్టర్‌లో క్లాస్‌తో పాటు మాస్ అవతార్‌ లో కనిపించారు విశ్వక్ సేన్.
 
అత్యంత భారీ బడ్జెట్‌తో వున్నత నిర్మాణ విలువలతో రూపొందిన ఈ చిత్రానికి విశ్వక్ కథానాయకుడు, దర్శకుడు నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది
 
మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, రామ్ మిరియాల మావా బ్రో పాటను స్పెషల్ గా కంపోజ్ చేశారు. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కూడా సినిమాపై అంచ‌నాలు పెంచింది.
 
వన్మయే క్రియేషన్స్ , విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని దినేష్ కె బాబు నిర్వహిస్తుండగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా అన్వర్ అలీ ఎడిటర్.
 
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ప్రముఖ తారాగణం.
 
తారాగణం: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి,  పృథ్వీరాజ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments