Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖచిత్రంలో పవర్ ఫుల్ లాయర్ పాత్రలో విశ్వక్ సేన్

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (17:20 IST)
Vishwak Sen
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "ముఖచిత్రం". కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా టాలీవుడ్‌లో అడుగు పెడుతున్నారు. 
 
డిఫరెంట్ కథాంశంతో రూపొందిన "ముఖచిత్రం" సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేశారు యువ హీరో విశ్వక్ సేన్. ఇవాళ విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. లాయర్ విశ్వామిత్ర పాత్రలో విశ్వక్ సేన్ కనిపించనున్నారు. ఈ పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటూ కథలో కీలకంగా వ్యవహరిస్తుంది. 15 నుంచి 20 నిమిషాలు సినిమాలో ఉండే లాయర్ విశ్వామిత్ర పాత్ర‌లో విశ్వక్ సేన్ అద్భుతంగా నటించారు. 
 
విశ్వక్ సేన్‌కు  ముఖచిత్రం  టీమ్ పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలిపింది. ఇప్పటిదాకా సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్ లుక్స్ ఈ మూవీని ఇంటెన్స్ లవ్ స్టోరీగా ప్రెజెంట్ చేయగా..ఇప్పుడు విశ్వక్ సేన్ పోస్టర్‌తో ఇదొక ఇంట్రెస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామాగా తెలుస్తున్నది. మూవీలో విశ్వక్ సేన్ యాడ్ అవడంతో సినిమా మీద మరింత క్రేజ్ పెరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.
నటీనటులు - వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్
 
సాంకేతిక నిపుణులు - సంగీతం - కాల భైరవ, ఎడిటింగ్ - పవన్ కళ్యాణ్, సమర్పణ - ఎస్ కేఎన్, నిర్మాతలు - ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల, కథ స్క్రీన్ ప్లే మాటలు - సందీప్ రాజ్, దర్శకత్వం - గంగాధర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments