Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి మూవీ త్వరలో టైటిల్ & ఫస్ట్ లుక్‌

Webdunia
గురువారం, 20 జులై 2023 (17:36 IST)
Vishwak Sen, Meenakshi
హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తన కొత్త చిత్రాన్నిచేస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది.
 
తాజాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. చిత్ర ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు. త్వరలో తదుపరి షెడ్యూల్‌ను యూనిట్ ప్రారంభించనుంది. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో కూడా త్వరలో రివీల్ కానుంది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
 
ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మనోజ్ కాటసాని కెమెరామెన్ గా పని చేస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యుసర్స్.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

వైసీపీకి వర్మకు ఉన్న సంబంధం అదే.. జీవీ రెడ్డి ఏమన్నారు..?

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవద్దని అమ్మకే ఫోన్ చేశారు.. గుడివాడ అమర్‌నాథ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments