Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ అక్కినేనిని పెళ్లి చేసుకోవాలి.. రెండేళ్లు ఫారిన్‌లో..?

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2022 (15:32 IST)
యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానులతో తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఉంటుంది. అలా తన క్రష్ గురించి కూడా విష్ణుప్రియ చెప్పింది. 
 
విష్ణుప్రియ తన యూట్యూబ్ ఛానెల్‌లో మా వంట మీ ఇంట అనే కార్యక్రమాన్ని చేసింది. ఈ ప్రోగ్రాంకు సుడిగాలి సుధీర్ మరదలు రమ్య ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా రమ్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా విష్ణుప్రియ తన పెళ్లిపై నోరు విప్పింది.
 
తనకు అక్కినేని అఖిల్ అంటే ప్రేమ అని గతంలో ఎన్నో సందర్భాల్లో విష్ణుప్రియ చెప్పింది. అయితే ప్రస్తుతం మాత్రం రమ్య అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. అఖిల్ అక్కినేని ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే పెళ్లి చేసుకుంటానని చెప్పేసింది. అఖిల్‌నే తాను పెళ్లి చేసుకుంటానని ఖరాఖండిగా చెప్పింది. 
 
అఖిల్ పోస్ట్‌లకు తాను కామెంట్ చేస్తేనే.. మా అయ్యగారిని వదలవా? అని ఫ్యాన్స్ ఆడుకుంటారని తెలిపింది. అయితే తనకు దేవుడు లాంటి మంచి మనిషి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. 
 
అఖిల్‌కు మంచి అమ్మాయి రావాలి.. దేవత లాంటి అమ్మాయి రావాలి.. ఆ దేవతను నేనే కావాలి.. అంటూ ఇలా తన మనసులోని కోరికను విష్ణుప్రియ బయటపెట్టేసింది. పెళ్లి చేసుకుని ఫారిన్ వెళ్లి రెండేళ్లు అక్కడే ఎంజాయ్ చేయాలని ఉందంటూ విష్ణుప్రియ ఆశాభావం వ్యక్తం చేసింది.
 
అయితే ఇటీవల సుమ యాంకరింగ్ చేసే క్యాష్ ప్రోగ్రామ్‌కు వచ్చిన శ్రీముఖి.. విష్ణుప్రియ గురించి చెప్పిన విశేషాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. విష్ణుప్రియకు నవదీప్ అంటే పిచ్చి అని.. అతని ఇంటికి కూడా వెళ్లిందని శ్రీముఖి చెప్పింది. నవదీప్ అంటే క్రష్ అని విష్ణుప్రియ కూడా చెప్పడంతో ఆమె నవదీప్‌తో ప్రేమలో ఉందా అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ భార్య అరెస్టు!!

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments