Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేయనున్న విష్ణు మంచు కన్నప్ప

డీవీ
సోమవారం, 13 మే 2024 (18:50 IST)
kannapa new poster
విష్ణు మంచు కన్నప్ప సినిమాను మే 20న కేన్స్‌లో జరగనున్న ఫిల్మ్ ఫెస్టివల్‌లో "ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప"గా ఆవిష్కరించనున్నారు. తెలుగు సినిమాని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తుండటం ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తుంది.
 
"ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప" కేవలం సినిమా కాదు.. ఇది ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ కానుంది. కథను చెప్పే విధానాన్ని పునర్నిర్వచించబోతోంది. ఇక రెడ్ కార్పెట్ మీద ఈ సినిమా రాక కోసం అందరూ చూస్తుండగా.. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. విష్ణు మంచు తన టీంతో కలిసి తెలుగు చిత్రసీమలో ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచేలా కన్నప్పను తెరకెక్కిస్తున్నారు.
 
"కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'కన్నప్ప' టీజర్‌ను ఆవిష్కరించబోవటం మాకు చాలా ఆనందంగా ఉంది" అని విష్ణు మంచు ట్వీట్ వేశారు. "ప్రపంచ ప్రేక్షకులకు మేం ఎంతో ఇష్టంగా రూపొందించిన కన్నప్పను ప్రదర్శించడానికి కేన్స్ అనువైన వేదికగా ఉపయోగపడుతుంది. మన భారతీయ చరిత్రను ప్రపంచ వేదికపైకి తీసుకురావడం, మన కథలు, సాంస్కృతిక వారసత్వం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము" అని అన్నారు.
 
"ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప" కేన్స్ అరంగేట్రం కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఇది గ్లోబల్ సినిమా ల్యాండ్‌స్కేప్‌లో చెరగని ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది. ఆకర్షణీయమైన కథనం, అద్భుతమైన చిత్రీకరణ, భారీ తారాగణంతో, అందరికీ ఓ మంచి అనుభూతినిచ్చేలా సినిమాను రూపొందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments