Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

దేవీ
సోమవారం, 28 ఏప్రియల్ 2025 (14:14 IST)
Vishnu Manchu
హీరో విష్ణు మంచు కన్నప్ప చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు కన్నప్ప సినిమా నిర్మించారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్, మధుబాల.. వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో నటించారు. 
 
ఈ నేపథ్యంలో విష్ణు మంచు కన్నప్ప మూవ్‌మెంట్ ని మే 8 నుంచి అమెరికాలో మొదలుపెట్టనున్నారు. గ్రాండ్ గా ఈ సినిమా గ్లోబల్ ప్రమోషన్స్ ని చేయనున్నారు. ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ చిత్రం కన్నప్ప రిలీజ్ కి ముందే ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చరిత్ర సృష్టించనుంది. 
 
అమెరికాలోని న్యూ జెర్సీలో కన్నప్ప రోడ్ షోతో మొదలుపెట్టి ఆ తర్వాత డల్లాస్, లాస్ ఏంజిల్స్ లో భారీ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సినిమాలోని ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ వర్కింగ్ విజువల్స్ కొంతమంది సెలెక్టెడ్ ఆడియన్స్ కి చూపించనున్నారు. కన్నప్ప సినిమాని ఇండియాతో పాటు అమెరికాలో కూడా భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు విష్ణు మంచు. 
 
ఇప్పటికే కన్నప్ప సినిమా విజువల్స్, సినిమాలోని భక్తి భావాన్ని ప్రేక్షకులు గొప్పగా ఊహించుకుంటున్నారు. ఈ కన్నప్ప మూవ్‌మెంట్ తో విష్ణు మంచు కేవలం సినిమా ప్రమోషన్స్ మాత్రమే చేయడం కాకుండా గ్లోబల్ ఆడియన్స్ కి గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు. కన్నప్ప ప్రయాణం మే 8 నుంచి ప్రారంభం కానుంది. ఒక కొత్త భక్తి భావం, కథ, సినిమాటిక్ అనుభవాన్ని ప్రేక్షకులకు చూపించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments