Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్, తమన్నా, జగపతిబాబు కాంబోలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్!

Webdunia
సోమవారం, 30 మే 2016 (11:19 IST)
పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత రాయుడుతో మరో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టిన మాస్‌ విశాల్‌ కొత్త చిత్రం జూన్‌ 9 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటుంది. 'రాయుడు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని ఇచ్చిన జి.హరి హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ఈ భారీ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నారు. 
 
ఈ చిత్ర విశేషాలను నిర్మాత జి.హరి తెలియజేస్తూ - ''భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో చేస్తున్న స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. నిర్మాతగా నాకు చాలా ప్రెస్టీజియస్‌ మూవీ అవుతుంది. విశాల్‌ కెరీర్‌లో ఇది చాలా హై రేంజ్‌ మూవీగా నిలుస్తుంది. షూటింగ్‌ స్టార్ట్‌ అవ్వకముందే ఈ సినిమాకి మంచి క్రేజ్‌ వచ్చింది. విశాల్‌తో నేను చేసిన 'రాయుడు' భారీ ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా రిలీజ్‌ అన్ని సెంటర్స్‌లో సూపర్‌హిట్‌ టాక్‌తో దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది.
 
'రాయుడు' సూపర్‌హిట్‌ అయిన ఈ ఆనంద సమయంలో విశాల్‌తో స్ట్రెయిట్‌ సినిమా ఎనౌన్స్‌ చెయ్యడం మరింత ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం విశాల్‌ కూడా చాలా స్పెషల్‌ కేర్‌ తీసుకుంటున్నారు. విశాల్‌, తమన్నా జంట ఈ సినిమాకి స్పెషల్‌ హైలైట్‌ అవుతుంది. ఇందులో జగపతిబాబుగారు మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. అలాగే తరుణ్‌ అరోరా మరో విలన్‌గా చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన పాటల రికార్డింగ్‌ పూర్తయింది. జూన్‌ 9 నుంచి నెలరోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతుంది. మిగతా షెడ్యూల్స్‌ చెన్నై, ఫారిన్‌లలో చేస్తాం'' అన్నారు. 
 
మాస్‌ హీరో విశాల్‌, తమన్నా, జగపతిబాబు, నిరోషా, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, సూరి, తరుణ్‌ అరోరా తదితరులు ముఖ్యపాత్రలు పోషించే ఈ చిత్రానికి సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్స్‌, ఎడిటింగ్‌: సెల్వ, ఫైట్స్‌: దినేష్‌, అనల్‌ అరసు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: ఆర్‌.జి.ప్రేమానందన్‌, సహనిర్మాతలు: ఎం.పురుషోత్తం, ఇ.కె.ప్రకాష్‌, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్‌.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments