Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రాయుడు' వస్తున్నాడు... విశాల్‌ సార్‌‌కు నేను పెద్ద ఫ్యాన్‌ అన్న శ్రీ దివ్య!

Webdunia
గురువారం, 12 మే 2016 (10:49 IST)
పంపిణీదారుడు హరి తమిళంలో విశాల్‌ నటించిన చిత్రాన్ని తెలుగులో 'రాయుడుగా' విడుదల చేస్తున్నాడు. బుధవారం రాత్రి ఆడియో హైదరాబాద్‌లో జరిగింది. బిగ్‌ సీడీని వి.వి.వినాయక్‌ ఆవిష్కరించారు. ఆడియో సీడీలను రానా విడుదల చేసి తొలి సీడీని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు అందజేశారు.
 
వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ ''హరిని మేమంతా తనని నెల్లూరు హరి అని పిలుస్తాం. రాయుడు సినిమా నిర్మాతగా మంచి బ్రేక్‌ కావాలి. విశాల్‌ అంటే మాకు చాలా ఇష్టం. విశాల్‌ గత చిత్రాలను మించి ఈ సినిమా హిట్‌ కావాలని, ముత్తయ్యగారికి ఈ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. హరికి ఈ సినిమాతో బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
 
విశాల్‌ మాట్లాడుతూ.. నాకు, ముత్తయ్యకు వినాయక్‌ గారి సినిమాలంటే చాలా ఇష్టం. ఒక హీరో మాస్‌ ఇమేజ్‌ ద్వారా అఖరి విలేజ్‌ వరకు తీసుకెళ్లి చూపించాలనేదే ముత్తయ్య కోరిక. నేను కాదు ఇంతకు ముందు కార్తీకానీ, శశికుమార్‌ గారికి కానీ ఓ గుర్తింపు తెచ్చే సినిమా చేశాడు. ఇందులో బస్తాలు మోసే క్యారెక్టర్‌ చేశాను. అనంతపూర్‌ యాసలో మాట్లాడతాను. వాడు-వీడు తర్వాత నాకు బాగా సెట్‌ అయ్యే క్యారెక్టర్‌ ఇది. కొత్త ఎక్స్‌ పీరియెన్స్‌. అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. నేను తెలుగు ప్రేక్షకులకు నచ్చే హీరో కావాలని మా నాన్నగారు అనుకున్నారు. ఆయన పందెంకోడి సినిమాను పట్టుబట్టి తెలుగులో విడుదల చేశారు. ఆ సినిమా సక్సెస్‌తో ఆయన అనుకున్నట్లుగానే నేను తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోయే హీరోనయ్యాను. కానీ ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత విశాల్‌ సినిమాలను నెక్ట్స్‌ లెవల్‌ కు ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఇమాన్‌ గారు మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. బి.ఎ.రాజుగారికి, వేల్‌ రాజ్‌ గారు సహా అందరికీ థాంక్స్‌'' అన్నారు.  
 
రానా మాట్లాడుతూ ''విశాల్‌ తమిళనాడులో పుట్టిన తెలుగువాడు. అక్కడ పెద్ద హీరో అయ్యాడు. తను గుడ్‌ సోల్‌. శ్రీదివ్య ఉంది కాబట్టి సినిమా హిట్‌ అవుతుంది. విశాల్‌ గారికి, ముత్తయ్యగారు సహా యూనిట్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.
 
గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ ''విశాల్‌ గారు చేసిన సినిమాలన్నింటినీ చూశాను. పందెంకోడి చిత్రాన్ని చాలా సార్లు చూశాను. అది నా ఫేవరేట్‌ సినిమా. అలాగే పొగరు, భయ్యా సినిమాలను చూశాను. రాయుడు మంచి మాస్‌ టైటిల్‌. పందెంకోడి కంటే పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. ముత్తయ్యగారు డైరెక్ట్‌ చేసిన కొంబన్‌ సినిమా చూశాను. ఈ సినిమాలో కూడా మాస్‌ ఎక్స్‌ ట్రార్డినరీగా ఉంది. ఇమామ్‌ గారి మెలోడీ మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టం. మాకు మంచి మిత్రుడైన డిస్ట్రిబ్యూటర్‌ హరిగారు ఈ చిత్రంతో ప్రొడ్యూసర్‌ అవుతున్నారు. ఈ సినిమా పెద్ద హిట్‌ సాధించి హరిగారికి బాగా లాభాలు రావాలి'' అన్నారు.    
 
శ్రీదివ్య మాట్లాడుతూ ''విశాల్‌ సార్‌‌కు నేను పెద్ద ఫ్యాన్‌. ఆయన గ్రేట్‌ హ్యుమన్‌ బీయింగ్‌. ఏదనుకుంటే అది చేసేస్తారు. ఆయన చేసే పనులు చూసి ఆయనపై గౌరవం ఇంకా పెరుగుతుంది. ముత్తయ్య గారు తెలుగు సినిమాలను బాగా చూస్తారు.  ఆయన తీసిన ఈ సినిమా తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది. వేల్‌ రాజ్‌ కు ప్రతి సీన్‌ ను చాలా అందంగా చూపించారు. నా కెరీర్‌ బెస్ట్‌ మూవీ అవుతుంది. తెలుగులో స్ట్రయిట్‌ మూవీలా ఫోకస్‌ చేసి విడుదల చేస్తున్నారు. ఆయనకు థాంక్స్‌'' అన్నారు.

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments