విశాల్... మకుటం’ చిత్రానికి గ్రాండ్ క్లైమాక్స్ షూట్ పూర్తి

దేవీ
మంగళవారం, 18 నవంబరు 2025 (16:38 IST)
Vishal - Makutam
హీరో విశాల్‌ స్వీయ దర్శకత్వంలో ‘మకుటం’ చిత్రం రాబోతోంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్‌కి రవి అరసు కథను అందించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్ సంచలనంగా మారాయి. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. వరుసగా 17 రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ చేసినట్టుగా ప్రకటించారు. ఈ మేరకు చిత్రయూనిట్ నుంచి ఓ ప్రెస్ నోట్‌ని కూడా రిలీజ్ చేశారు. అందులో ఏముందంటే..
 
విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మకుటం’ సినిమాకు సంబంధించిన గ్రాండ్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. 17 రోజులుగా నిర్విరామంగా షూటింగ్ చేశాం. ఇంటెన్స్‌తో కూడిన ఈ క్లైమాక్స్‌ను ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు చిత్రీకరించాం. ఓ వార్ సీక్వెన్స్‌కు ఎలాగైతే వందల కొద్దీ స్టంట్ ఆర్టిస్టులతో ఈ క్లైమాక్స్‌ను షూట్ చేశాం. దాదాపు 800 వందల మంది టెక్నీషియన్లతో ఈ షూటింగ్‌ను భారీ ఎత్తున కంప్లీట్ చేశాం.
 
రా ఎమోషన్స్, విజువల్ గ్రాండియర్, బ్రీత్ టేకింగ్ యాక్షన్‌లతో ఈ క్లైమాక్స్‌ను నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా చిత్రీకరించాం. విశాల్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ మొదటి సినిమాలో ఆయన పర్ఫామెన్స్ అదిరిపోతుంది. ఇక దిలీప్ సుబ్బరాయన్ వంటి స్టంట్ కొరియోగ్రాఫర్‌తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఈ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించాం.
 
ఈ 17 రోజుల షెడ్యూల్‌లో ప్రతీ ఒక్కరూ ఎంతో అకుంఠిత దీక్ష, అంకిత భావం, సినిమా పట్ల నిబద్దతతో పని చేశారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద విశాల్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం కంప్లీట్ కమర్షియల్ అంశాలతో రానుంది’ అని అన్నారు.
 
జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
 
 తారాగణం : విశాల్, దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

బీహార్‌లో ఘోర పరాజయం.. రాజకీయాలకు బైబై చెప్పనున్న ప్రశాంత్ కిషోర్?

మావోయిస్టుల మాట విని యువత చెడిపోవద్దు : బండి సంజయ్ హితవు

విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు

Bengaluru Scam: రూ.32కోట్ల స్కామ్.. ఆమెకు అంత సంపాదన ఎలా వచ్చింది? నెటిజన్ల ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments