Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్ష‌న్ టీజ‌ర్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న విశాల్

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (22:16 IST)
మాస్‌ హీరో విశాల్‌ హీరోగా సుందర్‌ సి. దర్శకత్వంలో ఆర్‌.రవీంద్రన్‌ నిర్మిస్తున్న స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ యాక్షన్‌. ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ యాక్షన్‌ చిత్రంతో దీపావ‌ళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మాస్‌ హీరో విశాల్‌. ఈ టీజర్‌లో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తున్న యాక్షన్‌ సీక్వెన్స్‌లను టర్కీలో 3 నెలలపాటు శ్రమించి చిత్రీకరించారు.
 
ఒళ్ళు గగుర్పొడిచే ఫైట్‌ సీక్వెన్సులు ఈ టీజర్‌లో కనిపించాయి. మాస్‌ హీరో విశాల్‌ ఈ యాక్షన్‌ పార్ట్‌ను ఎంతో డెడికేటెడ్‌గా చేశారని తెలుస్తోంది. ఒక విజువల్‌ ఫీస్ట్‌గా ఈ టీజర్‌ను చెప్పుకోవచ్చు. టర్కీలోని అందమైన లొకేషన్స్‌లో అంతే అందంగా ప్రతి షాట్‌ను చిత్రీకరించారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఓ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. హిప్‌హాప్‌ తమిళ అందించిన సంగీతం టీజర్‌ను ఎంతో ఎలివేట్‌ చేసేదిగా ఉంది. 
 
మిల్కీబ్యూటీ తమన్నా గ్లామర్‌, ముఖ్యంగా బికినీలో ఆమె కనిపించడం ఆడియన్స్‌కి కనువిందు చేసేలా ఉంది. నిర్మాత ఆర్‌.రవీంద్రన్‌ సినిమాను ఎంతో రిచ్‌గా, ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా నిర్మించారని టీజర్‌ చూస్తుంటేనే అర్థమవుతోంది. అలాగే సుందర్‌ సి. టేకింగ్‌ ఓ స్టైలిష్‌ లుక్‌ని తీసుకొచ్చింది. ఈ చిత్రంలో విశాల్‌ అండర్‌ కవర్‌ మిషన్‌లో పనిచేసే మిలటరీ కమాండోగా నటిస్తున్నారు. విశాల్‌ కెరీర్‌లోనే ఇది హయ్యస్ట్‌ బడ్జెట్‌ మూవీ అని చెప్పొచ్చు. మ‌రి.. టీజ‌ర్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న విశాల్ మూవీతో కూడా ఆక‌ట్టుకుంటాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Trisha Krishnan ఏదో ఒక రోజు తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతా: నటి త్రిష

oyorooms: పెళ్లి కాని జంటలకు ఇక నో రూమ్స్, ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ

మంత్రి పీఏ వసూళ్ల దందా : స్పందించిన హోం మంత్రి అనిత (Video)

నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

బాత్రూం వెళ్లాలని చెప్పి - డబ్బు - నగలతో ఉడాయించిన వధువు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments