నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని భర్త భరత్ రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఏపీలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైన విశాఖపట్నం నుంచి తదుపరి ఎన్నికల్లో భరత్ రంగంలో
నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని భర్త భరత్ రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఏపీలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైన విశాఖపట్నం నుంచి తదుపరి ఎన్నికల్లో భరత్ రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. మంత్రి నారా లోకేష్‌కు తోడుగా తన చిన్నల్లుడు భరత్‌ను కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలని బాలయ్య మాత్రం గట్టి పట్టుదలతోనే ఉన్నట్టు సమాచారం.
ఈ టికెట్‌ను ఆశిస్తున్న గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి, అలా కుదరకుంటే, తన వారసుడిగా మనవడైన భరత్‌కు సీటు ఇవ్వాలని ఇప్పటికే కోరినట్టు తెలుస్తోంది. ఆది నుంచి బయటి నుంచి వచ్చి పోటీ చేసిన వారికే పెద్దపీట వేస్తూ వచ్చిన విశాఖ వాసులు, గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థినిగా పోటీపడే విజయమ్మను ఓడించి.. బీజేపీకి చెందిన హరిబాబుకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం మరోసారి తిరిగి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపట్లేదని సమాచారం. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ సీటును తెలుగుదేశం పార్టీ బీజేపీకి వదిలేసిందన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో మంచి పట్టన్న నేతగా, ఓటమెరగని నేతగా ఉన్న గంటా శ్రీనివాస్‌ను అసెంబ్లీకి బదులుగా లోక్‌సభ పంపాలని కూడా తెలుగుదేశం పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.