Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ హార్ట్ బ్రేక్.. అనుష్క అన్ ఫాలో.. విరాట్ గడ్డం కూడా తీసేశాడు.. విడిపోయారా?

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (09:45 IST)
బాలీవుడ్‌లో బ్రేకప్‌లు ఫ్యానైపోయింది. వరుసగా రణ్‌బీర్ సింగ్, కత్రినా విడిపోయారంటూ మీడియాలో వార్తలొస్తున్న నేపథ్యంలో.. తాజాగా ప్రేమ జంటలు విరాట్ కోహ్లీ- అనుష్కలపై ఓ రూమర్ బిటౌన్లో హల్ చల్ చేస్తోంది. ప్రేమికుల రోజు వస్తుందనగా ఈ ప్రేమ జంట సెంటరాఫ్ అట్రాక్షన్‌గా హంగామా చేస్తుందనుకుంటే.. విరాట్ కోహ్లీ-అనుష్క జంట విడిపోయిందని తెలుస్తోంది. 
 
ఇన్నేళ్ల పాటు హాట్ టాపిక్‌గా ఉండిన వీరి ప్రేమాయణం బ్రేకప్ కావడానికి కారణం ఏమిటని ఫ్యాన్స్, సన్నిహితులు అందరూ ఆలోచిస్తున్నారు. పబ్లిక్ గానే చక్కర్లు కొట్టడం, విహారయాత్రలకు వెళ్ళడం, ఫ్లయింగ్ కిస్సులతో అట్రాక్ట్ చేయడంతో బాగా పాపులర్ అయిన ఈ జంట విడిపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఓసారి ఇన్ స్టాగ్రామ్‌లో హార్ట్ బ్రేక్ అంటూ ఓ ఫోటో పెట్టాడు విరాట్. ఈ ఫోటోను వెంటనే తొలగించినా ఈలోపే చాలామందికి అనుమానం వచ్చేసింది. ఆ తర్వాత అనుష్కను విరాట్ అన్ ఫాలో చేయడంతో ఫ్యాన్స్‌కి అసలు సంగతి అర్థమైంది. దీనికి తోడు ఇప్పుడు విరాట్ గడ్డం కూడా ఈ జంట బ్రేకప్‌ని ఫిక్స్ చేసేసింది. 
 
పంజాబీ పెళ్ళిళ్లలో వరుడు కచ్చితంగా గడ్డంతో ఉండాల్సింది ఆచారంగా వస్తోంది. అనుష్కతో పెళ్ళి కోసమే విరాట్ కోహ్లీ గడ్డం పెంచాడని.. అయితే పెళ్ళి ప్రతిపాదనకు అనుష్క తిరస్కరించడంతో గడ్డాన్ని కోహ్లీ తీసేసినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మను దూరం చేసుకోలేదని.. తనే కోహ్లీని దూరంగా వుంచిందని టాక్ వస్తోంది. మరి అదే నిజమైతే ఈ ప్రేమికుల రోజు కోహ్లీకి మరింత చేదు అనుభవాన్ని మిగిల్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments