Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

డీవీ
మంగళవారం, 2 జులై 2024 (18:08 IST)
Varun Sandesh Mahendra Nath Kundla Director Adyant Harsha and ohters
ఇటీవల "నింద" మూవీతో పేరు తెచ్చుకున్న హీరో వరుణ్ సందేశ్ తన కొత్త సినిమా "విరాజి" తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని మహా మూవీస్ తో కలిసి  ఎమ్ 3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. విరాజి చిత్రంతో ఆద్యంత్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ  సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ రోజు విరాజి సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ,  విరాజి చాలా మంచి టైటిల్. వరుణ్ సందేశ్ ను కొత్త అవతారం లో చూపించే చిత్రమిది. మూవీ చాలా బాగా వచ్చింది. ఆగస్టు 2న రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. ఈ నెల రోజులు బాగా ప్రమోట్ చేయాలని ప్లాన్ చేశాం. మేము కొత్త వాళ్లుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు.
 
దర్శకుడు ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ, దర్శకుడిగా నా మొదటి సినిమా. త్వరలో రివీల్ చేసే మా మూవీ ఫస్ట్ లుక్ చూస్తే మీరు తప్పకుండా ఇంప్రెస్ అవుతారు. ఇది వరుణ్ సందేశ్ కు టైలర్ మేడ్ మూవీ. మా మూవీ కాస్టింగ్ అందరికీ థ్యాంక్స్. అలాగే నాతో ఉండి స్క్రీన్ ప్లే డైలాగ్స్ లో సపోర్ట్ చేసిన శ్రీకాంత్ వర్మకు థ్యాంక్స్. మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అంతా చాలా కష్టపడ్డారు. వారికి కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.
 
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ - విరాజి కథ చెప్పేందుకు హర్ష నా దగ్గరకు వచ్చాడు. ఫస్టాఫ్ వింటున్నప్పుడు పది నిమిషాల తర్వాత కథ ఇలా ఉంటుందేమో అని రెండు మూడు చోట్ల గెస్ చేశాను. సెకండాఫ్ కు వచ్చేసరికి గూస్ బంప్స్ వచ్చాయి. కథ చాలా బాగుందని హర్ష కు చెప్పాను. ఈ సినిమా తప్పకుండా చేయాలని ఫిక్స్ అయ్యా. మా డైరెక్టర్ హర్ష కు ఇది మొదటి సినిమా కానీ ఆయన చేయబోయే చాలా సినిమాలకు ఇది మొదటి సినిమా. హర్ష కు లాంగ్ కెరీర్ ఉంటుంది. నేను రీసెంట్ గా చేసిన నింద మూవీ కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఓ పదేళ్ల తర్వాత నా మూవీ కి అలాంటి ఓపెనింగ్స్ చూశాను. నింద సక్సెస్ నాకు మంచి మోటివేషన్, బూస్ట్ ఇచ్చింది. నింద డైరెక్టర్ రాజేశ్ కు రెండు పెద్ద ప్రొడక్షన్స్ నుంచి సినిమా  చేసేందుకు పిలుపులు వచ్చాయి. హర్ష కు కూడా అలాంటి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఇవాళ్టికి ఎగ్జాక్ట్ గా నెల రోజుల సమయం ఉంది మా సినిమా రిలీజ్ కు. ఇవాళ్టి నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేశాం. మీ అందరికీ తప్పకుండా నచ్చే సినిమా అవుతుంది. విరాజి నేను నా 17 ఏళ్ల కెరీర్ లో చేయని ఒక డిఫరెంట్ మూవీ. అలాంటి మోస్ట్ క్రేజియెస్ట్ క్యారెక్టర్ ఇందులో చేశాను. ఈ నెల 10వ తేదీన విరాజి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం. మీరు చూడగానే సర్ ప్రైజ్ అవుతారు. ఈ క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు గంట సమయం పట్టేది. నేను విరాజి మూవీ రిలీజ్ కోసం ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను. మా ప్రొడ్యూసర్ మహేంద్ర నాకు బ్రదర్ లాంటి వారు. ఈ మూవీని ప్రేక్షకుల దగ్గరకు బాగా రీచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విరాజి సినిమాకు పనిచేసిన వారంతా ప్యాషన్ తో వర్క్ చేశారు. మా సినిమా కు మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
నటి ప్రమోదిని మాట్లాడుతూ - విరాజి ఎంత మంచి పేరో సినిమా కూడా అంతే బాగుంటుంది. ఈ చిత్రంలో నేనొక ఇంపార్టెంట్ రోల్ చేశాను. సినిమా కంప్లీట్ అయ్యింది. ప్రొడ్యూసర్ గారు చెప్పినట్లు ప్రమోషన్ చేసి గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం. విరాజి ని ప్రేక్షకుల దగ్గరకు చేర్చడంలో మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. అన్నారు.
 
నటుడు రఘు కారుమంచి మాట్లాడుతూ - మా మూవీకి డైరెక్టర్ హర్ష విరాజి అనే మంచి తెలుగు టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో నేను నటించాలని పట్టుబట్టి మరీ తీసుకొచ్చాడు హర్ష. ఉదయం 6 గంటల నుంచి అతని ఫోన్స్ మొదలయ్యేవి. ఈ సినిమాలో నటించడం వల్ల సహ నటీనటుల రూపంలో నాకు మంచి మిత్రులు దొరికారు. నా ప్రపంచంలోకి వారు వచ్చారు. వరుణ్ సందేశ్ తో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. విరాజి ఎంత బాగుంటుంది అనేది మీరు ఆగస్టు 2న థియేటర్స్ లో చూస్తారు. అన్నారు.
 
నటుడు ఫణి మాట్లాడుతూ, ఇంటర్ లో ఉన్నప్పుడు వరుణ్ గారి హ్యాపీ డేస్ సినిమా చూసి ఆ సినిమా ఇచ్చిన ఇన్సిపిరేషన్ తో డిగ్రీ కంప్లీట్ చేశా. విరాజి మా అందరికీ చాలా మంచి మూవీ అవుతుంది. అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ ఎబినెజర్ పాల్ (ఎబీ) మాట్లాడుతూ - విరాజి సినిమా కోసం ప్రొడ్యూసర్ మహేంద్ర, డైరెక్టర్ హర్ష నన్ను అప్రోచ్ అయ్యారు. ఈ మూవీ కి మ్యూజిక్ చేసేందుకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. బీజీఎం కోసం 45 డేస్ వర్క్ చేశాం. సినిమా మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఆగస్టు 2న థియేటర్స్ లో చూడండి. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments