Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నటన సూపర్బ్... మెస్మరైజ్ చేసిన విలన్ : "వినయ విధేయ రామ" ట్విట్టర్ రివ్యూ

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (11:54 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం తాజాగా చిత్రం "వినయ విధేయ రామ". బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రం జనవరి 11వ తేదీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 
 
ఈ చిత్రాన్ని చూసిన మెగా ఫ్యాన్స్... తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా, రామ్ చరణ్ నటన సూపర్బ్‌గా ఉందని పేర్కొంటే.. విలన్‌గా వివేక్ ఒబెరాయి మెస్మరైజ్ చేశాడంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అలాగే, హీరోయిన్ కియారా తన అందం, డ్యాన్సులతో మెప్పించిందని వెల్లడిస్తున్నారు.
 
ముఖ్యంగా, చిత్రంలో అజర్‌బైజాన్ సహా మరికొన్ని సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతినాయకుడి పాత్రలో వివేక్ ఒబెరాయ్ మెస్మరైజ్ చేశారని టాక్.. కానీ హార్స్ రైడింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ కొన్ని మాత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.
 
దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీత బాణీలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయాయని అంటున్నారు. గత యేడాది వచ్చిన 'రంగస్థలం' చిత్రంలో డ్యాన్సులకు కథను బట్టి చెర్రీ పెద్దగా స్టెప్పులకు ప్రాధాన్యమివ్వలేదు. కానీ ఈ చిత్రంలో డ్యాన్సుల పరంగా దుమ్మురేపాడని నెటిజన్లు చెబుతున్నారు. 
 
ఈ చిత్రం తొలి అర్థభాగం బాగానే ఉన్నప్పటికీ రెండో భాగం మాత్రం రొటీన్ కథతో దర్శకుడు బోయపాటి మాత్రం ప్రేక్షకులకు కాస్త బోర్ కొట్టించేలా నిరుత్సాహానికి గురిచేశారనే టాక్ వినొస్తుంది. 
 
ఇకపోతే, ఇంటర్వెల్ బ్యాంగ్, బీహార్ ఎపిసోడ్స్ మాత్రం ఆకట్టుకునేలా బోయపాటి చిత్రీకరించారనే అభిప్రాయం నెటిజన్ల నుంచి వ్యక్తమవుతోంది. ఎమోషన్, యాక్షన్‌ అంశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. మొత్తంమీద ఈ చిత్రం రంగస్థలం వంటి హిట్ కాదని చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments