Webdunia - Bharat's app for daily news and videos

Install App

విక్రాంత్, చాందినీ మధ్యలో ప్రెగ్నెన్సీ కిట్ నేపథ్యంలో సంతాన ప్రాప్తిరస్తు

డీవీ
బుధవారం, 15 జనవరి 2025 (07:16 IST)
Vikrant and Chandni'
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా "ఏబీసీడీ" సినిమా, రాజ్ తరుణ్ తో "అహ నా పెళ్లంట" అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా తెరకెక్కుతోంది.
 
ఈ రోజు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో హీరో విక్రాంత్, హీరోయిన్ చాందినీ ఆకట్టుకుంటున్నారు. పోస్టర్ లో ప్రెగ్నెన్సీ కిట్ ఉండటం ఆసక్తికరంగా ఉంది. ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా "సంతాన ప్రాప్తిరస్తు" సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
 
 
నటీనటులు - విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూ కాశ్మీర్‌లో వింత వ్యాధి.. 13కి పెరిగిన పిల్లల మరణాలు.. లక్షణాలివే

Hyderabad : కొండపై స్త్రీపురుషుల మృతదేహాలు.. ఏదైనా సంబంధం ఉందా?

Tirumala: శ్రీవారి ఆలయంలో అరకిలోకు పైగా బంగారాన్ని దొంగలించాడు.. ఎలా ఆ పని చేశాడంటే?

Bear Hugging Shivling: శివలింగాన్ని కౌగిలించుకున్న ఎలుగుబంటి.. వీడియో వైరల్

Samosa: సమోసా తిందామని చూస్తే బ్లేడ్.. షాకైన హోంగార్డు.. ఎక్కడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments