Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిని పెళ్లాడనున్న డైరక్టర్ విక్రమ్ కుమార్.. సెప్టెంబరులో పెళ్లి

Webdunia
మంగళవారం, 7 జూన్ 2016 (10:06 IST)
సూర్య నటించిన ''24'' మూవీ హిట్‌తో మాంచి ఊపుమీదున్న దర్శకుడు విక్రమ్ కుమార్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఎట్టకేలకు బ్రహ్మచర్యానికి స్వస్తి చెప్పి తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయినే పెళ్లాడ్డానికి సిద్ధపడ్డాడు. రెహ్మాన్ దగ్గర సౌండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శ్రీనిధి అనే అమ్మాయితో చాలాకాలంగా విక్రమ్ కుమార్ ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. 'ఇష్క్'‌, 'మ‌నం', '24' లాంటి వైవిధ్య‌మైన సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మరింతగా దగ్గరయ్యాడు దర్శకుడు విక్రమ్ కుమార్.  ''24'' మూవీతో దక్షిణాదిలో ఇంటిలిజెంట్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 
 
వయసులో కూడా పెద్దవాడిలాగే కనిపిస్తాడు. అలాంటిది విక్ర‌మ్‌కి పెళ్లి కాలేదంటే ఎవ్వరూ నమ్మరు. తను ప్రేమించిన అమ్మాయితోనే విక్ర‌మ్‌కు ఆదివారం నిశ్చితార్థం జరిగింది. విక్ర‌మ్ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా తెర‌కెక్కిన ''24'' మూవీ టైంలో శ్రీనిధితో పరిచయమై.. ఇద్దరి అభిరుచులు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో సెప్టెంబ‌ర్‌లో వీరి వివాహం జ‌ర‌ుగ‌నుంది. ఆ త‌ర్వాత విక్ర‌మ్ త‌న నెక్ట్స్ మూవీని ప‌ట్టాలెక్కించ‌నున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments