Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ జీవితానికి ఆయన పొగడ్త చాలు.. : కంగనా రనౌత్

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (14:34 IST)
ఈ జీవితానికి ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రశంసలు, పొగడ్తలు చాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు. తన జీవితానికి అది చాలన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్ట్ పెట్టారు. 'ఎమర్జెన్సీ' సినిమా ఎడిటింగ్ పూర్తయిందని, ఆ చిత్రాన్ని చూసిన తొలి వ్యక్తి విజయేంద్ర ప్రసాద్ అని ఆమె తెలిపారు. 
 
'సినిమా చూస్తూ విజయేంద్ర ప్రసాద్ పలుమార్లు కంటతడి పెట్టుకున్నారు. సినిమా పూర్తయ్యాక 'నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది' అన్నారు. నా గురువు, శ్రేయోభిలాషుల ఆశీస్సులతో ఎమర్జెన్సీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌కు చేరుకుంది. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం' అని ఆ పోస్ట్‌లో కంగనా రనౌత్ పేర్కొన్నారు. 
 
విజయేంద్ర ప్రసాద్ గతంలో కథ అందించిన 'మణికర్ణిక' సినిమాలో కంగన ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది 'ఎమర్జెన్సీ'. భారత రాజకీయ చరిత్రలో ఓ ప్రధాన ఘట్టమైన ఎమర్జెన్సీ రోజుల నాటి ఆసక్తికర కథాంశంతో రూపొందింది. ఈ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను కంగనా పోషించగా.. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments