Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జబర్దస్త్', పటాస్‌లకు కొత్త చిక్కు.. నిషేధించాలని సంతకాల సేకరణ

''జబర్దస్త్'' షోను గతంలో పలు వివాదాలు వెంటాడాయి. తాజాగా పటాస్ షోకు కూడా చిక్కులు తప్పలేదు. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం అయ్యే జబర్దస్త్, పటాస్ వంటి రియాల్టీ షోల్లో మహిళలను కించపరుస్తూ ఆరోపణలు వస్తున్న

Webdunia
శుక్రవారం, 2 మార్చి 2018 (12:40 IST)
''జబర్దస్త్'' షోను గతంలో పలు వివాదాలు వెంటాడాయి. తాజాగా పటాస్ షోకు కూడా చిక్కులు తప్పలేదు. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం అయ్యే జబర్దస్త్, పటాస్ వంటి రియాల్టీ షోల్లో మహిళలను కించపరుస్తూ ఆరోపణలు వస్తున్నాయని.. వాటిని నిషేధించాలని మహిళా సంఘాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి.
 
తాజాగా విజయవాడలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరుగుతుండగా.. వేలాది మంది మద్దతు ఇస్తున్నారు. డబుల్ మీనింగ్ డైలాగులతో కూడిన ఈ షోలను ప్రదర్శించకూడదని.. ఈ షోలను నిషేధించాలని వారు కోరుతున్నారు. 
 
అలాగే అశ్లీల వెబ్ సైట్లను కూడా తొలగించాలని కోరుతూ ఏపీ మహిళా సమాఖ్య, ఐద్వా తదితర సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరుగుతోంది. ఇంకా అసభ్యకర షోలను ఆపేందుకు సర్కారు నడుం బిగించాలని.. మీడియా వాచ్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని మహిళా నేతలు డిమాండ్ చేశారు.
 
టీఆర్పీ రేటింగ్ కోసం ఇలాంటి షోలను ప్రోత్సహించడం సరికాదని ఐద్వా నాయకురాలు కె.శ్రీదేవి, విజయవాడ మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ ఓ భారతి మండిపడ్డారు. కాగా ఇలాంటి షోల్లో డబుల్ మీనింగ్ డైలాగులు, ప్రత్యేక వర్గాన్ని టార్గెట్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ముఖ్యంగా జబర్దస్త్ స్కిట్‌లపై, నటులపై కేసులు కూడా నమోదైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments