Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయకచవితికి విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ - లాభం

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (18:13 IST)
Labham still
విజయ్ సేతుపతి శ్రుతిహాసన్ జంటగా న‌టించిన సినిమా తెలుగులో `లాభం`గా రాబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు.  S P జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
 
ఈ చిత్రానికి లాయర్ శ్రీరామ్ సమర్పణ. హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.  విజయ్ సేతుపతి నటించిన మాస్టర్, ఉప్పెన తరువాత తెలుగులో విడుదల అవుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న విడుదల అవుతోంది.
 
నిర్మాతలు మాట్లాడుతూ, రెండు భాషల్లో మొదటిసారి విజయ్ సేతుపతి చిత్రం విడుదలకావడం విశేషం. మాస్టర్, ఉప్పెన తరువాత విజయ్ సేతుపతి నటించిన పక్కా కమర్షియల్ చిత్రం ఇది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. విజయ్ సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది ' అన్నారు.
 
తారాగణం:-
విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్, జగపతిబాబు, సాయి ధన్సిక, కలైయ రసన్, రమేష్ తిలక్, పృత్వి రాజన్, డేనియల్ అన్నే పోపే, నితీష్ వీర, జయ్ వర్మన్ తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments