Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరవేగంగా విజ‌య్ సేతుప‌తి - తమన్నల 'డా.ధ‌ర్మ‌రాజు ఎం.బి.బి.ఎస్‌'...

డిఫరెంట్ మూవీస్‌తో తమిళంలో వరుస విజయాలో దూసుకెళ్తున్న హీరో విజయ్ సేతుపతి `పిజ్జా` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. విజయ్ సేతుపతి కథానాయకుడుగా శీను రామ‌సామి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `ధర్మద

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (16:47 IST)
డిఫరెంట్ మూవీస్‌తో తమిళంలో వరుస విజయాలో దూసుకెళ్తున్న హీరో విజయ్ సేతుపతి `పిజ్జా` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. విజయ్ సేతుపతి కథానాయకుడుగా శీను రామ‌సామి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `ధర్మదొరై` చిత్రం.. తమిళంలో ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో సుధా సినిమాస్‌ బ్యాన‌ర్‌పై జె.సాంబ‌శివ‌రావు నిర్మాత‌గా `డా.ధ‌ర్మ‌రాజు ఎం.బి.బి.ఎస్‌.` పేరుతో విడుద‌ల చేస్తున్నారు. 
 
ప‌విత్ర‌మైన డాక్ట‌రు వృత్తిలోని ఓ యువ‌కుడు ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాడు. ఆ స‌మ‌స్య‌ల‌ను ఎలా అధిగ‌మించాడు అనేదే సినిమా క‌థ‌. స్టార్ హీరోయిన్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించింది. త‌మిళంలో సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని సాధించిన ఈ సినిమాలో విజ‌య్ సేతుపతి త‌ల్లి పాత్ర‌లో సీనియ‌ర్ న‌టి రాధిక న‌టించ‌డం విశేషం. స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించాడు. 
 
బిచ్చ‌గాడు వంటి సెన్సేష‌న్ చిత్రానికి మాట‌లు పాటలు అందించిన భాష్య‌శ్రీ ఈ చిత్రానికి మాట‌లు, పాట‌లు అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేసి, సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామ‌ని నిర్మాత జె.సాంబ‌శివ‌రావు తెలియ‌జేశారు. విజ‌య్ సేతుప‌తి, త‌మ‌న్నా, రాధిక‌, ఐశ్వ‌ర్య రాజేష్‌, సృష్టి డాంగే త‌దిత‌రులు న‌టించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ABPM-JAY: ఆయుష్మాన్ భారత్ 9.84 కోట్లకు పైగా ఆస్పత్రుల్లో చేరేందుకు అనుమతి

Car Climbs Wall: కాంపౌండ్ గోడపైకి ఎక్కిన కారు.. డ్రైవర్ ఎలా నడిపాడంటే?

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments