Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ 'సర్కార్' దూకుడుకి చెర్రీ 'రంగస్థలం' ఔట్...

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (11:30 IST)
గతంలో కె.సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని రూ.215 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. అంటే నాన్ బాహుబలిగా రికార్డు సృష్టించింది. 
 
అయితే, ఈ రికార్డును ఇపుడు తమిళ హీరో విజయ్ నటించిన 'సర్కార్' చిత్రం చెరిపేసింది. దీపావళి సందర్భంగా నవంబరు 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. 
 
ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే వివాదాల్లో చిక్కుకుంది. ఇక విడుదలైన తర్వాత అన్నాడీఎంకే కార్యకర్తలు చేసిన రాద్దాంతం అంతాఇంతాకాదు. దీంతో ఈ చిత్రానికి రీసెన్సార్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ఈ చిత్రానికి వివాదాలు వీడలేదు. 
 
కానీ, వసూళ్లపరంగా ఈ చిత్రం తారాస్థాయిలో దూసుకెళుతోంది. ఈ చిత్రం తొలి ఇప్పటికే రూ.217 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి సౌత్ ఇండియాలోనే అత్యధిక గ్రాస్‌ను వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఇకపోతే, విజయ్ నటించిన 'మెర్సల్' చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరగా, ఇపుడు 'సర్కార్' కూడా ఆ వరుసలో చేరి సరికొత్త రికార్డును నెలకొల్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.7 కోట్ల ప్యాకేజీ.. ప్చ్.. భార్య విడాకులు అడుగుతోంది.. జీవితంలో ఓడిపోయా!!

జగన్ 2.0.. ఇంత లైట్‌గా తీసుకుంటే ఎలా..? బెంగళూరుకు అప్పుడప్పుడు వెళ్లాలా?

పెళ్లి మండపంలో అనుకోని అతిథిలా చిరుతపులి ... బెంబేలెత్తిపోయిన చుట్టాలు (Video)

Valentines Day: ప్రేమోన్మాది ఘాతుకం- యువతి తలపై కత్తితో పొడిచి.. ముఖంపై యాసిడ్ పోశాడు

ప్రేమికుల దినోత్సవం రోజున అమానుషం.. యువతిపై యాసిడ్ పోసి కత్తితో దాడి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments