Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో 750 థియేటర్లలో 'సర్కార్‌' :: గుండె పగిలినంత పని అయిందంటున్న మురుగదాస్

Webdunia
ఆదివారం, 28 అక్టోబరు 2018 (17:13 IST)
తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం సర్కార్. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల విడుదల చేసిన సర్కార్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తెలుగు, తమిళంలో విడుదలైన ప్రచార చిత్రాలు 'సర్కార్' చిత్రంపై అంచనాలను రెట్టింపు చేశాయి. 
 
ఈ సందర్భంగా తెలుగులో వంశీ వల్లభనేని ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సుమారు 750కుపైగా థియేటర్లలో దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు వంశీ తెలిపారు. ప్రస్తుత రాజకీయాలపై ఓ కార్పొరేట్ వ్యాపారి ఎలాంటి పోరాటం చేశాడనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.
 
మరోవైపు, ఈ సినిమా కథ తనదంటూ రచయిత వరుణ్‌ రాజేంద్రన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా దర్శకుడు మురుగదాస్‌ మాట్లాడారు. 'దక్షిణ చిత్ర పరిశ్రమ రచయితల సంఘం అధ్యక్షుడు భాగ్యరాజ్‌ కేవలం వరుణ్ తరపు వాదననే విన్నారు. మమ్మల్ని కలవలేదు. ఆయన చేసింది చాలా పెద్ద తప్పు. ఈ చిత్ర కథ తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి రావడం సబబు కాదన్నారు. 
 
ముఖ్యంగా, వరుణ్ కథకు, నా కథకు ఉన్న పోలిక ఒక్కటే. ఇద్దరి కథలు ఓట్లను ఎలా దుర్వినియోగం చేశారు? అన్న నేపథ్యంలో ఉంటాయి. వరుణ్‌ రాసుకున్న కథలో కీలక అంశాలు లేవు. కానీ నా కథలో ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో చోటుచేసుకున్న సన్నివేశాలన్నీ చూపించాం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గురించి కూడా ప్రస్తావించాం. వరుణ్‌ 2007లో కథ రాసుకున్నారు. అలాంటప్పుడు జయలలిత మరణం గురించి అందులో ఎలా ప్రస్తావిస్తారు? ఈ ఘటన నన్ను చాలా బాధించింది. నా గుండె పగిలినంత పనైంది అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments