Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్‌లో హల్‌చల్ చేస్తున్న విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా'

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ తాజా చిత్రం "టాక్సీవాలా". ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. కానీ, విడుదల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదాపడింది కూడా.

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (15:05 IST)
టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ తాజా చిత్రం "టాక్సీవాలా". ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. కానీ, విడుదల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదాపడింది కూడా. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సీన్లు మొబైల్‌లో లీకయ్యాయి. 
 
నిజానికి విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమా పైరసీ బారిన పడిన విషయం తెల్సిందే. అదేసమయంలో ఆయన మరో చిత్రం 'టాక్సీవాలా' పైరసీకి గురైందన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడా వార్తలు నిజమేనని తేలింది. 
 
పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో కొందరు యువకులు మొబైల్ ఫోన్లలో 'టాక్సీవాలా' చూస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సినిమా వారి మొబైల్స్‌లోకి ఎలా వచ్చింది? వారు ఎవరెవరికి ఫార్వార్డ్ చేశారన్న కోణంలో విచారణ సాగిస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. 
 
విజయ్ దేవరకొండ సరసన మాళవికా నాయర్, ప్రియాంకలు నటించిన ఈ చిత్రం చానాళ్ల క్రితమే విడుదలకు సిద్ధమైనా, పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా, విజయ్ దేవరకొండ నటించిన మరో తాజా చిత్రం నోటా వచ్చే నెల ఐదో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments