Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోట్లాది మంది యువతకి చిరంజీవి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2023 (12:44 IST)
చిత్ర పరిశ్రమలోనే కాకుండా కోట్లాది మంది యువతకు మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తిగా నిలిచారని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. అలాంటి నటుడి చిత్రాలు పరాజయం పాలైనప్పుడు విమర్శించడం తగదని హితవు పలికారు. సరైన దర్శకుడు, మంచి కథ కుదిరితే అగ్ర నటులు తమ సత్తా ఏంటో చూపిస్తారని వ్యాఖ్యానించారు. ఇందుకు రజినీకాంత్ నటించిన "జైలర్" చిత్రం ఉదాహారణ అని పేర్కొన్నారు. 
 
వరుస పరాజయాలు వచ్చినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చిత్ర పరిశ్రమ భవిష్యత్ కోసం కష్టపడుతూనే ఉన్నారన్నారు. తన తాజా చిత్రం 'ఖుషి' ప్రచారంలో భాగంగా చెన్నైలో విజయ్‌ దేవరకొండ పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మాతలు ఎన్‌వీఎస్‌ ప్రసాద్‌, ఆర్‌బీ చౌదరిలతో కలిసి తెలుగు అగ్రహీరోలపై అక్కడి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. విజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
రజినీ కాంత్ ‘జైలర్’, కమలహాసన్ ‘విక్రమ్’ చిత్రాలతో సత్తా చాటారన్నారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలు కూడా ఎన్నో గొప్ప చిత్రాలు చేస్తున్నారని విజయ్ ప్రశంసించారు. ఇకపోతే, ఖుషి చిత్రం ప్రతి ఒక్కరినీ ఆనందపరుస్తుందన్నారు. సీనియర్ నటుడు నాజర్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గదికి రప్పించుకుని.. నగ్న ఫోటోలు తీసి?

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ.. ప్రమాణ స్వీకారంకు సర్వం సిద్ధం

వంట విషయంలో భర్తతో గొడవ.. చెరువులో చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య (video)

Rooster: మూడు గంటలకు కోడి కూస్తోంది.. నిద్ర పట్టట్లేదు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

26 ఏళ్ల వ్యక్తి కడుపులో పెన్ క్యాప్.. 21 సంవత్సరాల క్రితం మింగేశాడు.. ఇప్పుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments