Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ, సమంత ఖుషి ఫస్ట్ లుక్ - డిసెంబర్ 23 సినిమా రిలీజ్

Webdunia
సోమవారం, 16 మే 2022 (15:40 IST)
Vijay Devarakonda, Samantha
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత ఆయనకు జోడీగా కనిపించనుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మాతలు.మంచి రొమాంటిక్ కామెడి గా రాబోతున్న ఈ సినిమా ఇటీవలే కాశ్మీర్ లో షూటింగ్ ప్రారంభించుకుంది.ప్రస్తుతం అక్కడే రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది. 
 
తాజాగా ఈ సినిమాకు "ఖుషి" టైటిల్ ఖరారు చేశారు. విజయ్ దేవరకొండ, సమంత ఫస్ట్ లుక్  విడుదల చేశారు.  ఫస్ట్ లుక్ లో ఈ జంట లవ్లీగా కనిపిస్తున్నారు.  విజయ్,సమంత కెరీర్ లలో ఇదొక మెమొరబుల్ ఫిల్మ్ గా మిగులిపోతుందనే వైబ్స్ టైటిల్, ఫస్ట్ లుక్ తో ఏర్పడుతున్నాయి. ప్రేమలో గెలిస్తే ఖుషి, ఆ ప్రేమను కుటుంబంతో పంచుకుంటే మరింత ఖుషి. జీవితంలో ఈ సంతోషాన్ని మించిన సంపద లేదు అన్నట్లు "ఖుషి" టైటిల్, ఫస్ట్ లుక్ డిజైన్ క్రియేటివ్ గా ఉండి ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్ 23,2022 న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.
 
ఈ సినిమా కశ్మీర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ చేయనున్నారు.
 
నటీనటులు: 
విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.
 
టెక్నికల్ టీమ్:
మేకప్: బాషా
కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్
ఆర్ట్: ఉత్తర్ కుమార్, చంద్రిక
ఫైట్స్: పీటర్ హెయిన్
రచనా సహకారం: నరేష్ బాబు.పి
పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా
పబ్లిసిటీ : బాబ సాయి
మార్కెటింగ్ : ఫస్ట్ షో
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్
మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్
సి.ఇ.ఓ : చెర్రీ
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జి.మురళి
నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి
కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: శివ నిర్వాణ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ... రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత (Video)

సునీత విలియమ్స్ - బచ్ విల్మెర్ పరిస్థితేంటి : వీరు లేకుండానే కదిలిన ఆస్ట్రోనాట్ క్యాప్సుల్

రూ.33 కోట్లు దారి మళ్లించిన స్విగ్గీ మాజీ ఉద్యోగి!

అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా సైలెంట్‌గా సైనెడ్‌తో చంపేసే లేడీ కిల్లర్స్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments