Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలు మీద కాలు వేసుకొని అడగండి అన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (19:16 IST)
Vijaydevakond one foot on the other
సాధార‌ణంగా తెలుగు సినిమాకే ప‌రిమితం అయిన హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. మొద‌టి సినిమా పెళ్లిచూపులు టైంలోనే హిట్ అవుతుంద‌ని చెప్పేశాడు. ఆ మాట‌లు విన్నాక‌, కొత్తోడు. స్పీడ్ ఎక్కువ అని చాలా మంది కామెంట్ చేశారంటూ గ‌తాన్ని గుర్తు చేసుకున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్పుడు లైగ‌ర్‌లో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దేశ‌మంతా ప‌ర్య‌టిస్తున్నారు.
 
పెళ్లిచూపులు త‌ర్వాత కొన్ని సినిమాలు చేశాడు. గీత గోవిందం, అర్జున్ రెడ్డి చిత్రాల‌తో మంచి ఫామ్‌లోకి వెళ్ళిపోయారు. ఆ త‌ర్వాత నోటా, టాక్సీవాలా చిత్రాలు వ‌చ్చాయి. టాక్సీవాలా సినిమా విడుద‌ల‌కుముందు వెబ్ దునియా జ‌ర్న‌లిస్టు అడిగిన ప్ర‌శ్న‌ను గుర్తుచేయ‌గా, హైద‌రాబాద్‌లో సోమ‌వారంనాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ స‌మాధాం ఇచ్చారు.
 
టాక్సీవాలా టైమ్ లో మనం ఫ్రీగా మాట్లాడుకున్నాం.మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసాం.కానీ ఇప్పుడు మీరు స్టార్ట్ అయిపోయారు.అంత ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాం. అంటూ కిక్కిరిసిన విలేక‌రుల స‌మావేశంలో అడిగిన ప్ర‌శ్న‌కు.. విజ‌య్ చాలా స‌ర‌దాగా మాట్లాడారు.
 
- అట్లా ఎం లేదు. మీరు అడగండి.కాలు మీద కాలు వేసుకొని అడగండి.నేను కూడా అలాగే కూర్చుంట. ఫ్రీగా మాట్లాడుకుందాం. అంటూ స్టేజీపైన కూర్చీలోనే రెండు కాళ్ళు ఎత్తి కూర్చుని  చెప్పారు.
అప్ప‌ట్లో బాలీవుడ్‌కు వెళ‌తారా! అన్న అడిగితే, స్మైల్ ఇచ్చి, చూద్దాం. తెలుగులోనే ఇంకా నాకింకా క్లారిటీ రాలేదు. ఎన్నో ఐడియాలు వున్నాయ‌ని స‌మాధానం చెప్పారు అని విలేక‌రి గుర్తు చేయ‌గా..
 
- టేకేబౌల్‌లాగా వంటి న‌మ‌స్క‌రిస్తూ.. ఎప్ప‌టికీ ఈ విష‌యం గుర్తుపెట్టుకుంటాన‌ని బ‌దులిచ్చారు. ఇది సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతుంది. లైగ‌ర్ త‌ర్వాత జ‌న‌గ‌న‌మ‌ణ సినిమా కూడా చేయ‌బోతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమాపై పూర్తి న‌మ్మ‌కంతో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాకినాడ SEZ కేటాయింపులు: విజయసాయి రెడ్డికి ఈడీ కొత్త నోటీసులు

అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు బీజేపీకి నష్టం కలిగిస్తాయా?

గచ్చిబౌలిలో నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్- విగ్గులతో 50 పెళ్లిళ్లు చేసుకున్నాడు.. (video)

Male Dwakra: మహిళలకే కాదు.. ఇక పురుషులకు కూడా డ్వాక్రా.. ఏపీ సర్కార్

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments