Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్‌దేవ‌ర‌కొండ రిలీజ్ చేసిన `ఎంత బావుందో...`సోల్‌ఫుల్ మెలొడీ.

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (19:56 IST)
Gunde katha vintara
పాపుల‌ర్ క‌మెడియ‌న్ మ‌ధునంద‌న్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘గుండె క‌థ వింటారా’. వంశీధ‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ ప‌తాకంపై  క్రాంతి మంగ‌ళంప‌ల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
మ‌ధునంద‌న్ స‌ర‌స‌న స్వాతిస్ట కృష్ణన్‌, శ్రేయ న‌విలే హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి శ్రీ‌రామ‌న‌వ‌మి శుభాకాంక్ష‌ల‌తో `ఎంత బావుందో...‌` లిరిక‌ల్ సాంగ్‌ని విజ‌య్‌దేవ‌ర‌కొండ రిలీజ్‌చేసి చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.
 
`ఎంత బావుందో..ప‌క్క‌నే ఉన్నా మ‌న‌సులో మాట చెప్ప‌లేకున్నా...గుప్పెడుగుండె త‌ట్టింది ఎవ‌రో నాకు చెప్పింది..పైకే చెప్ప‌నంటోంది హాయో మాయో అంతా కొత్త‌గా ఉంది ఐనా ఇదే బాగుంది బ‌హుశా ఎదురుప‌డ‌నంది` అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి  మ‌సాలా కాఫీ సంగీతం స‌మ‌కూర్చ‌గా కృష్ణ చైత‌న్య  సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వ‌రుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆల‌పించారు. ‌
 
తారాగ‌ణం:
మ‌ధునంద‌న్, స్వాతిస్ట కృష్ణన్‌, శ్రేయ న‌విలే
 
సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: వంశీధ‌ర్
నిర్మాత‌లు : క్రాంతి మంగ‌ళంప‌ల్లి, అభిషేక్ చిప్ప
బ్యాన‌ర్‌: ట్రినిటి పిక్చర్స్
సినిమాటోగ్ర‌ఫి: ర‌వి వ‌ర్మ‌న్ నీలిమేఘం, సురేష్ భార్గ‌వ్‌
సంగీతం: మ‌సాల కాఫీ
ఎడిట‌ర్‌: సాయి కిర‌ణ్ ముద్దం
యాక్ష‌న్‌: `రియ‌ల్` స‌తీష్
కొరియోగ్ర‌ఫి: భాను మాస్ట‌ర్
లిరిక్స్‌: కృష్ణ చైత‌న్య
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌:  గౌరీ నాయుడు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేసిన ప్రియుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments