Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ కొత్త చిత్రం ప్రారంభానికి హేమాహేమీలు...

Webdunia
గురువారం, 18 అక్టోబరు 2018 (20:39 IST)
సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న సినిమా ఓపెనింగ్ ద‌స‌రా సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఇండ‌స్ట్రీ పెద్ద‌లంతా వ‌చ్చారు. టి సుబ్బిరామిరెడ్డి, నిర్మాత‌లు అల్లు అర‌వింద్, అశ్వినీదత్, బివిఎస్ఎన్ ప్ర‌సాద్,సి క‌ళ్యాణ్.. ద‌ర్శ‌కులు కే రాఘ‌వేంద్ర‌రావ్ మ‌రియు నాగ్ అశ్విన్ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసారు.
 
క‌ళాబంధు టి సుబ్బిరామిరెడ్డి హీరోహీరోయిన్ల‌పై తొలి షాట్‌కు క్లాప్ కొట్ట‌గా.. అల్లు అర‌వింద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. తొలి షాట్ ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావ్ తెర‌కెక్కించారు. ఈ ప్రేమ‌క‌థా చిత్రంలో రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్, ఇసాబెల్లె డి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. జేకే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కేఎస్ రామారావు స‌మ‌ర్పిస్తుండ‌గా.. కేఏ వ‌ల్ల‌భ నిర్మిస్తున్నారు. 
 
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా,ఐశ్వ‌ర్యా రాజేష్,ఇసాబెల్లె డి, ర‌చ‌న‌, ద‌ర్శ‌కుడు: క్రాంతి మాధ‌వ్, స‌మ‌ర్ప‌కుడు: కేఎస్ రామారావు, నిర్మాత‌: కేఎ వ‌ల్ల‌భ‌, నిర్మాణ సంస్థ: క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్, సంగీతం: గోపీసుంద‌ర్, సినిమాటోగ్ర‌ఫర్: జేకే, ప్రొడ‌క్ష‌న్ డిజైన్: సాహీ సురేష్, పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments