Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహానటి'లో ఏఎన్నార్ పాత్రలో విజయ్

ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ సొంత బ్యానెర్ వైజయంతి మూవీస్‌‌పై అలనాటి అందాల నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఇందులో ప్రధాన పాత్రలో కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇటీవ

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (13:49 IST)
ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ సొంత బ్యానెర్ వైజయంతి మూవీస్‌‌పై అలనాటి అందాల నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఇందులో ప్రధాన పాత్రలో కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇటీవల వివాహం చేసుకున్న సమంత కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
 
అయితే, తాజాగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ విజయ్‌ దేవరకొండ కూడా ఓ పాత్రలో కనిపించనున్నారట. అలనాటి మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావుగా విజయ్ నటించనున్నారట. దీనికి కారణం మహానటి చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, హీరో విజయ్‌ దేవరకొండలు మంచి స్నేహితులు కావడమేనట.
 
వీరిద్దరూ గతంలో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంలో కలిసి పనిచేశారు. అందుకే ఈ చిత్రంలో విజయ్‌ని అక్కినేని నాగేశ్వరరావు పాత్రకు ఎంపికచేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇక ఎన్టీఆర్‌ పాత్రలో ఎవరు నటిస్తున్నారు అన్న విషయంపై స్పష్టత రాలేదు.
 
అదేసమయంలో మహానటిలో అలనాటి విలక్షణ నటుడు ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్‌బాబు, శివాజీ గణేశన్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌‌లు నటించనున్న విషయం తెల్సిందే. వీరితోపాటు దర్శకుడు క్రిష్‌, ప్రకాశ్‌‌రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీర్తి సురేశ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments