ముగిసిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా నిశ్చితార్థం

ఠాగూర్
శుక్రవారం, 3 అక్టోబరు 2025 (23:08 IST)
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నాలు త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. వీరి నిశ్చితార్థం శుక్రవారం హైదరాబాద్ నగరంలో జరిగింది. గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్న విషయంతెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల అంగీకారంతో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన నిశ్చితార్థ వేడుకలో ఇరు కుటుంబాలు, కొద్ది మంది బంధువులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని విజయ్‌ దేవరకొండ సన్నిహితులు తెలిపారు. అయితే, వీరిద్దరి వివాహం వచ్చే యేడాది ఫిబ్రవరి నెలలో జరుగనుంది. 
 
కాగా, 'గీత గోవిందం' సినిమాలో కలిసి నటించిన వీరు హిట్‌ పెయిర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్‌’లోనూ నటించారు. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్టు పలుమార్లు వార్తలు రాగా తాము స్నేహితులం మాత్రమేనని చెబుతుండేవారు. అయినా పలు వేడుకలకు కలిసి వెళ్లడంతో రూమర్స్‌ వస్తూనే ఉండేవి. ఇప్పుడు అభిమానులకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చినట్టైంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijayawada: విజయవాడలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వని వైకాపా.. ఎదురు దెబ్బ తప్పదా?

Polavaram: 2019లో టీడీపీ గెలిచి ఉంటే, పోలవరం 2021-22 నాటికి పూర్తయ్యేది-నిమ్మల

Free schemes: ఉచిత పథకాలను ఎత్తేస్తేనే మంచిదా? ఆ ధైర్యం వుందా?

Chandra Babu: విద్యార్థులకు 25 పైసల వడ్డీకే రుణాలు.. చంద్రబాబు

కడపలో రూ. 250 కోట్లతో ఎలిస్టా తయారీ కర్మాగారాన్ని ప్రారంభించిన నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments