Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ టికెట్ రిలీజ్ చేసి అంబాజీపేట టీంను అభినందించిన విజయ్ దేవరకొండ

డీవీ
గురువారం, 1 ఫిబ్రవరి 2024 (11:19 IST)
amabaji peta team with devarakonda
సుహాస్ హీరోగా నటించిన సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇవాళ హైదరాబాద్ లో "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా బిగ్ టికెట్ ను హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ఈ సినిమాను చూసిన విజయ్ దేవరకొండ మూవీ చాలా బాగుందంటూ ప్రశంసించారు. ఇదొక స్పెషల్ ఫిల్మ్ అని, తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని చెప్పారు.
 
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" బిగ్ టికెట్ లాంఛ్ చేయడం సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి సినిమా ప్రమోషన్ లో భాగమవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా టీజర్ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ వచ్చింది. ఈ మూవీ టీమ్ లోని ప్రతి ఒక్కరూ నాకు దగ్గర వాళ్లు. ఈ ఫిబ్రవరి 2న థియేటర్స్ లోకి ఒక స్పెషల్ మూవీ రాబోతోంది. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా చూశాను. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. మ్యూజిక్, ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ లు నెక్ట్ లెవెల్ లో ఉన్నాయి. సుహాస్ ఎప్పటిలాగా చాలా బాగా నటించాడు. శరణ్య అద్భుతంగా పర్ ఫార్మ్ చేసింది. ఏ సినిమాకైనా ఫస్ట్ హాఫ్ చూశాక కొంత విరామం తీసుకునే నేను ఈ సినిమాకు కంటిన్యూగా ఫుల్ మూవీ చూశాను. అంత క్యూరియస్ గా అనిపించింది. మీరు కూడా థియేటర్ లో ఇదే ఫీల్ అవుతారు. అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు - రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదు : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

రిటైర్డ్ టీచర్ ఇంట్లోకి చొరబడ్డ దొంగ.. క్షమించండి.. తిరిగి ఇచ్చేస్తాను..?

బస్సు టర్నింగ్ ఇచ్చుకుంది.. మహిళ రోడ్డుపై ఎలా పడిందంటే? (Video)

అగ్నివీర్ అజయ్ కుమార్‌కి రూ.98లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిందా లేదా?

బాలుడి కోసం కాన్వాయ్ ఆపిన పవన్ కల్యాణ్.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments