Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ భాస్కర్ కుమారుడు శ్రీ కమల్ హీరోగా శివాని నాయిక‌గా జిలేబి ప్రారంభం

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2022 (15:01 IST)
Sri Kamal, Shivani clap by trivikram
స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల దర్శకుడు కే విజయ్ భాస్కర్ కొంత విరామం తర్వాత మెగాఫోన్ పడుతున్నారు. ద‌ర్శ‌కుడు విజయ భాస్కర్ కుమారుడు శ్రీ కమల్ హీరోగా  శివాని రాజశేఖర్ నాయిక‌గా న‌టించ‌నున్న చిత్రం జిలేబి షూటింగ్ లాంఛ‌నంగా అన్న‌పూర్ణ స్టూడియోలో ద‌స‌రానాడు ప్రారంభ‌మైంది.  పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ  ఎస్ఆర్కే బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట శ్రీనివాస్ బొగ్గరం సమర్పిస్తున్నారు.
 
విజయ భాస్కర్‌ దర్శకత్వంలోవస్తున్న 13వ చిత్రమిది. నిర్మాత స్రవంతి రవి కిషోర్ స్క్రిప్ట్ అందించగా డాక్టర్ రాజశేఖర్ కెమరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ ఇవ్వగా,  తొలి సన్నివేశానికి బి గోపాల్ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
 
చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా, ఎం ఆర్ వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్  శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
నటీనటులు,  శ్రీ కమల్, శివాని రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్ , మురళీ శర్మ, గెటప్  శ్రీను, మిర్చి కిరణ్ , గుండు సుదర్శన్ , బిత్తిరి సత్తి తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments