Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

దేవీ
గురువారం, 21 ఆగస్టు 2025 (19:14 IST)
Vijay Antony, Vaagai Chandrasekhar
'మార్గన్' విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో 'భద్రకాళి' వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్,  మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 'భద్రకాళి' సెప్టెంబర్ 19న రిలీజ్  కానుంది.
 
మేకర్స్ ఫస్ట్ సింగిల్ మారెనా ని రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. విజయ్ ఆంటోని బ్యూటీఫుల్ లవ్ సాంగ్ గా కంపోజ్ చేశారు. భాష్యశ్రీ రాసిన లిరిక్స్ హత్తుకునేలా వున్నాయి. అభిజిత్ అనిల్‌కుమార్ వోకల్స్ మరింత ఎమోషన్ ని యాడ్ చేశాయి. ఈ లవ్ సాంగ్ ఆడియన్స్ కి ఇన్స్టంట్ గా కనెక్ట్ అవుతోంది.
 
తెలుగులో మార్గన్ సినిమాను విజయం దిశగా నడిపించిన ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తుంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సపోర్ట్ కూడా ఉండడంతో ప్రాజెక్ట్‌పై మంచి బజ్ ఉంది.
 
ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణపాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బాట్, రియా జితు, మాస్టర్ కేశవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తున్నారు. షెల్లీ కాలిస్ట్ డీవోపీ, విజయ్ ఆంటోనీ స్వయంగా మ్యూజిక్ అందిస్తున్నారు. రేమండ్ డెరిక్ ఎడిటర్. రాజశేఖర్ ఫైట్ మాస్టర్.  శ్రీరమన్ ఆర్ట్ డైరెక్టర్. తెలుగులో డైలాగ్స్‌ని రాజశేఖర్ రెడ్డి రాశారు.  
 
నటీనటులు: విజయ్ ఆంటోని, వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బోట్, రియా జిత్తు, మాస్టర్ కేశవ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు- చైనాను అధిగమించిన భారతదేశం

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments