Webdunia - Bharat's app for daily news and videos

Install App

7 నిమిషాల ప్ర‌మోష‌న్ కాశిని కాపాడుతుందా..?

‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగులో బాగా పాపులర్ అయిన హీరో విజ‌య్ ఆంటోని. ఈ నెల 18న ‘కాశి’గా ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. సునయన, అంజలి హీరోయిన్లుగా.. కిరుతుగ ఉదయనిధి దర్శ‌కత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. ప్ర‌మోష‌న్‌లో భాగం

Webdunia
బుధవారం, 16 మే 2018 (19:49 IST)
‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగులో బాగా పాపులర్ అయిన హీరో విజ‌య్ ఆంటోని. ఈ నెల 18న ‘కాశి’గా ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. సునయన, అంజలి హీరోయిన్లుగా.. కిరుతుగ ఉదయనిధి దర్శ‌కత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఈ మూవీ తొలి ఏడు నిమిషాల సినిమాను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని భార్య ఫాటిమా విజయ్ ఆంటోని ఫిలిం కార్పోరేషన్ బ్యాన‌ర్ పైన నిర్మిస్తున్నారు. 
 
తాజాగా విడుదలైన ‘కాశి’ తొలి ఏడు నిమిషాల సినిమాను బట్టి ఈ మూవీలో మరోసారి మ‌ద‌ర్ సెంటిమెంట్ చూపించబోతున్నాడు అని తెలిసింది. థ్రిల్లర్, యాక్షన్, సెంటిమెంట్ మేళవింపుతో నాలుగైదు గెటప్పుల్లో దర్శనం ఇచ్చి థ్రిల్ చేస్తున్నాడు విజయ్ ఆంటోనీ. ఒక పాముతో సినిమాను స్టార్ట్ చేయడం.. ‘అమ్మా.. నీకో విషయం చెప్పనా? నాకెప్పుడూ ఓ కల వస్తుందని చెప్తాను కదా.. ఓ చిన్నపిల్లాడిని ఎద్దు పొడిచినట్టు, పెద్ద పాము వచ్చినట్టు.. నా గత జీవితంతో ఏదో జరిగి ఉంటుందనిపిస్తుంది. 
 
నేను చిన్నగా ఉన్నప్పుడు ఏదో అయి ఉంటుందమ్మా. అదే కలలా వస్తుంది.. ఒక్కసారి ఇండియాకి వెళ్లి.. నా చిన్నప్పుడు ఏం అయిందో.. నన్ను కన్నవారు ఎందుకు వద్దనుకున్నారో.. తెలుసుకుని వస్తానమ్మా..’ అని చెప్పడం ఇది ఈ మూవీ గత జన్మల నేపథ్యంలో అల్లిన కథగా తెలుస్తోంది. మొత్తానికి విజయ్ ఆంటోనీ వరుస ఫ్లాప్‌ల తరువాత ‘కాశి’ చిత్రంతో బిచ్చగాడు లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ కొడతాడేమో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నర్సంపేటలో హైటెక్ వ్యభిచార రాకెట్‌‌.. నలుగురి అరెస్ట్.. ఇద్దరు మహిళలు సేఫ్

వేసవి వేడి నుండి ఉపశమనం- నెల్లూరులో ఏసీ బస్సు షెల్టర్లు

బెంగుళూరు కుర్రోడికి తిక్కకుదిర్చిన పోలీసులు (Video)

పబ్లిక్‌లో ఇదేమీ విడ్డూరంరా నాయనో (Video)

కత్తితో బెదిరించి విమానం హైజాక్‌కు దుండగుడు యత్నం... చివరకు ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments